Daily Horoscope: ఈరోజు మీరోజు! జూలై 23 పంచాంగం, రాశిఫలాలు!

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

K V D Varma
Updated on: 23 July 2020 8:37 AM IST
horoscope today in telugu
X
today horoscope

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం, 23 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం తదియ (సా. 6-40 వరకు) తర్వాత చవితి, మఘ నక్షత్రం (రా. 8-06 వరకు) తర్వాత పుబ్బ నక్షత్రం.. అమృత ఘడియలు ( సా. 5-47 నుంచి 7-19 వరకు), వర్జ్యం ( ఉ. 8-34 నుంచి 10-06 వరకు తె.వ. 3-40 నుంచి 5-11 వరకు) దుర్ముహూర్తం (ఉ. 9-57 నుంచి 10-48 వరకు తిరిగి మ. 3-06 నుంచి 3-58 వరకు) రాహుకాలం (మ. 1-30 నుంచి 3-00 వరకు) సూర్యోదయం ఉ.5-39 సూర్యాస్తమయం సా.6-33

ఈరోజు రాశి ఫలాలు

మేషం

అనుకూల పరిస్థితులున్నాయి. కీలక ఆర్థిక వ్యవహారములు లాభిస్తాయి . నూతన వస్తువులను కొంటారు. తోటివారి సహాయ సహకారాలున్నాయి. ఈశ్వర సందర్శనం శుభప్రదం.

వృషభం

శ్రమతోకూడిన విజయాలున్నాయి . మిమి రంగాల్లో జాగ్రత్తగా ముందుకు సాగాలి. వాదప్రతివాదాల జోలికి పోకుండా ఉండటం మేలు. శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు అవసరం. దుర్గ దేవి స్తోత్ర పారాయణ చేయడం మంచిది.

మిథునం

శుభకాలం. దైవబలం ఉంది . అనుకున్న పనులు నెరవేరుతాయి. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. ప్రయాణాలు కలిసివస్తాయి. గణపతి నామాన్ని స్మరించడం మంచినిస్తుంది.

కర్కాటకం

చేపట్టే పనిలో అవగాహనా లోపం లేకుండా చూసుకోవాలి. బంధువులతో వ్యవహారములలో అతిచొరవ తీసుకోవద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త మీ మనోధైర్యమును పెంచుతుంది. ఆదిత్య హృదయ పారాయణ మేలు చేస్తుంది.

సింహం

సాహసోపేతమైన నిర్ణయాలు గొప్ప లాభాన్నిస్తాయి. మనోధైర్యం తగ్గకుండా చూసుకోవాలి. చేపట్టిన పనులలో ఆటంకములు ఎదురైనా అదిగమించే ప్రయత్నము చేస్తారు. సూర్య స్తుతి శక్తినిస్తుంది.

కన్య

మిమి రంగాల్లో అనుకూలఫలితాలున్నాయి. మీరు ఊహించినదానికంటే అధిక ధనలాభమును పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన పనులలలో ముందడుగు పడుతుంది. శత్రువులమీద మీరే విజయం సాధిస్తారు. శివారాధన మేలు చేస్తుంది.

తుల

ముఖ్యవిషయాల్లో క్రమశిక్షణతో ముందుకు సాగండి మంచి జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపాటు వద్దు. బంధుమిత్రులను కలిసి సంతోషముగా గడుపుతారు. ఇష్టదైవ నామాన్ని స్మరిస్తే మేలు జరుగుతుంది.

వృశ్చికం

ముఖ వ్యవహారములలో అనూహ్యమైన లాభములు పొందుతారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కొన్ని పరిస్థితులు మీకు బాద కలిగిస్తాయి. సాయి బాబా సందర్శనం శుభప్రదం.

ధనుస్సు

శ్రమ పెరగకుండా చూసుకోవాలి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు చేయని పొరపాటుకు నింద పడాల్సి రావచ్చు. శ్రీ విష్ణు సహస్రనామావళి పఠించడం మంచిది.

మకరం

అవసరమునకు డబ్బు చేతికి అందుతుంది. పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరించి, అనుకూల నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో వాదులాటలకు దిగకపోవడమే మంచిది. గోవిందా నామాలు చదవటం మంచిది.

కుంభం

చేపట్టే పనుల్లో ముందుచూపుతో వ్యవహరించాలి . శ్రమ పెరుగుతుంది . మనోబలం తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండాలి. స్థిరమైన నిర్ణయాలతో అభివృద్ధిని సాధిస్తారు. శివ నామస్మరణ మేలు చేస్తుంది.


K V D Varma

K V D Varma

Next Story