Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

Daily Horoscope
x

ఈరోజు వివిధ రాశుల ఫలాలు

Highlights

Daily Horoscope: ఈ రోజు వివిధ రాశుల వారి దినఫలాలు

Daily Horoscope:మంగళవారం| మార్చి 09-03-2021 | శ్రీ శార్వరి నామ సంవత్సరం| ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసం| తిథి బ.ఏకాదశి సా.గం.4.21 వరకు| తదుపరి ద్వాదశి |నక్షత్రం ఉత్తరాషాఢ రా.9.52 వరకు| తదుపరి శ్రవణం| వర్జ్యం ఉ.6.20 నుంచి 7.53 వరకు| దుర్ముహూర్తం ఉ.8.32 నుంచి 9.25 వరకు| తదుపరి రా.10.54 నుంచి 11.45 వరకు| అమృతఘడియలు ప.3.35 నుంచి 7.12 వరకు|యమగండం ఉ.9.00 నుంచి 10.30 వరకువరకు|యమగండం : ఉ.9.00 నుంచి 10.30 వరకు. కరణం బాలవ సా.4.21| యోగం వరీయన్ ప.గం.1.42 వరకు| సూర్యోదయం : 6.16 | సూర్యాస్తమయం సా.6.04| రాహుకాలం : ప. 3.00 నుంచి 4.౩౦

ఈ రోజు రాశి ఫలాలు

మేష రాశి: ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ప్రత్యేక పేరుప్రతిష్ఠలు పొందుతారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత. సన్మానాలు.

వృషభ రాశి: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

మిథున రాశి: పరిస్థితులు అనుకూలించవు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. అనారోగ్యం. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు.

కర్కాటక రాశి: కొత్తవ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

సింహ రాశి: కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని ఒత్తిడులు.

కన్యా రాశి: నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

తుల రాశి: వ్యవహారాలలో ఆటంకాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో అకారణంగా వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప ఇబ్బందులు.

వృశ్చిక రాశి: పరిస్థితులు అనుకూలిస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

ధనుస్సు రాశి: నిరుద్యోగులకు ఉద్యోగయోగం. పరిచయాలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత ప్రగతి.

మకర రాశి: కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు వాయిదా వేస్తారు. శ్రమ పెరుగుతుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

కుంభ రాశి: వ్యవహారాలలో అవాంతరాలు. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. బంధువర్గంతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

మీన రాశి: పనులలో స్వల్ప ఆటంకాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Show Full Article
Print Article
Next Story
More Stories