Top
logo

Daily Horoscope: ఈరోజు మీరోజు! ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది

Horoscope today
X

ఈరోజు రాశి ఫలాలు 

Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 23 ఫిబ్రవరి, 2021 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. ఉత్తరాయణం | మాఘ మాసం | శుక్లపక్షం | ఏకాదశి 18:07:03 వరకు తదుపరి ద్వాదశమి | ఆరుద్ర నక్షత్రం 12:31:17 వరకు తదుపరి పునర్వసు | వర్జ్యం 07:38:28 నుండి 08:24:03 వరకు | అమృత ఘడియలు 12:12:00 నుండి 12:57:35 వరకు | దుర్ముహూర్తం 09:09:39 నుండి 09:55:14 వరకు | రాహుకాలం 15:25:45 నుండి 16:51:14 వరకు | సూర్యోదయం: 06:52:53 | సూర్యాస్తమయం: 18:16:43

ఈరోజు రాశి ఫలాలు


మేషం: కార్యక్రమాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. కష్టం ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది.బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో వ్యయప్రయాసలు.

వృషభం: కష్టానికి తగ్గ ఫలితం కనిపిస్తుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. రాబడి పెరుగుతుంది.వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళాకారులకు సన్మానాలు.

మిథునం: చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆదాయం తగ్గుతుంది.బంధువిరోధాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. కళాకారులకు నిరుత్సాహం.

కర్కాటకం: రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. జీవితాశయం నెరవేరుతుంది. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది.పాతబాకీలు అందుతాయి. పనుల్లో విజయం. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

సింహం: రావలసిన బాకీలు అందక ఇబ్బంది పడతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆస్తి వివాదాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. చోరభయం. మానసిక అశాంతి

కన్య: ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. దేవాలయ దర్శనాలు.

తుల: ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

వృశ్చికం: ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు.వ్యాపార, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యసమస్యలు.

ధనుస్సు: కుటుంబ, ఆరోగ్యసమస్యలు. వ్యవహారాలు ముందుకు సాగవు. అనారోగ్యం. బంధువులతో అకారణంగా తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. విలువైన వస్తువులు జాగ్రత్త.

మకరం: కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆత్మీయుల మరింత దగ్గరవుతారు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. విందువినోదాలు.

కుంభం: కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. దేవాలయదర్శనాలు.

మీనం: ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. మానసిక అశాంతి. కార్యక్రమాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి. దేవాలయ దర్శనాలు.

Web TitleDaily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu Today 23rd February 2021
Next Story