Top
logo

Daily Horoscope: ఈ రోజు మీ రోజు! నేటి రాశి ఫలాలు..

Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu Today 22nd July 2021
X

నేటి రాశి ఫలాలు

Highlights

Daily Horoscope: ఈ రోజు మీ రోజు! నేటి రాశి ఫలాలు..

ఈ రోజు రాశి ఫలాలు: శ్రీ ప్లవ నామ సంవత్సరం; దక్షిణాయనం గ్రీష్మ రుతువు; ఆషాఢ మాసం;శుక్ల పక్షం త్రయోదశి: మ.12.17 తదుపరి చతుర్దశి మూల: మ.4.09 తదుపరి పూర్వాషాఢ వర్జ్యం: మ.2.38 నుంచి 4.09 వరకు తిరిగి రా.1.13 నుంచి 2.44 వరకు అమృత ఘడియలు: ఉ.10.09 నుంచి 11.39 వరకు దుర్ముహూర్తం: ఉ.9.57 నుంచి 10.48 వరకు తిరిగి మ.3.06 నుంచి 3.58 వరకు రాహుకాలం: మ.1.30 నుంచి 3.00 వరకు సూర్యోదయం: ఉ.5-39, సూర్యాస్తమయం: సా.6-33

మేష రాశి: వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. ఈ రోజు ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశ కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. అనారోగ్యం. బంధువులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు.

వృషభ రాశి: ఈ రోజు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. పనులు చకచకా సాగుతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. తోటివారిని కలుపుకొనిపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆపదలు ఎదురవుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి.

మిథున రాశి: ఆకస్మిక ధన, వస్తులాభాలు. బంధువుల నుంచి ముఖ్య సమాచారం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి : ఆలోచనలు అంతగా కలసిరావు. బంధువులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

సింహ రాశి: శ్రమకు ఫలితం కనిపించదు. భూవివాదాలు నెలకొంటాయి. రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ. విద్యార్థుల కృషి అంతగా ఫలించదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. మనోబలం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. ఈశ్వర దర్శనం శుభప్రదం.

కన్యా రాశి : ఈ రోజు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తుల రాశి : ఈ రోజు కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. పనుల్లో అవాంతరాలు. రుణఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. ప్రయాణాలు వాయిదా. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి. నలుగురిలో గొప్పపేరు సంపాదిస్తారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. సమయాలు తగ్గుతాయి. లక్ష్మీదర్శనం శుభప్రదం.

వృశ్చిక రాశి: గ్రహబలం మిశ్రమంగా ఉంది. ఈ రోజు యత్నకార్యసిద్ధి. మిత్రులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు సమస్యలు తీరతాయి. చేపట్టే పనిలో బద్ధకాన్ని వీడాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధుమిత్రులతో విబేధాలు రావచ్చు. ఇష్టదేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది.

ధనస్సు రాశి : వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. ఈ రోజు కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమ కొంత పెరుగుతుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకర రాశి : ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. ఈ రోజు నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహనయోగం. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి. గొప్పవారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభప్రదం

కుంభ రాశి : నూతన విద్యావకాశాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. క్రీడాకారులకు మంచి గుర్తింపు. ఈ రోజు ఇంటాబయటా ప్రోత్సాహం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మీన రాశి: కలహాలకు దూరంగా ఉండాలి. ఈ రోజు మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో కొద్దిపాటి చిక్కులు. ఉద్యోగాలలో అదనపు పనిభారం. ఆలయాలు సందర్శిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి. తోటివారి సహకారంతో సత్పలితాలను సాధిస్తారు. ఉద్యోగంలో ఆటంకాలు రాకుండా ముందుచూపుతో వ్యవహరించాలి.

Web TitleDaily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu Today 22nd July 2021
Next Story