Top
logo

Daily Horoscope: ఈ రోజు మీ రోజు! నేటి రాశి ఫలాలు..

Daily Horoscope
X

Daily Horoscope: ఈ రోజు మీ రోజు! నేటి రాశి ఫలాలు..

Highlights

Daily Horoscope: ఈ రోజు మీ రోజు! నేటి రాశి ఫలాలు..

ఈ రోజు రాశి ఫలాలు: శ్రీ ప్లవ నామ సంవత్సరం; దక్షిణాయనం గ్రీష్మ రుతువు; ఆషాఢ మాసం;శుక్ల పక్షం ద్వాదశి: మ.2.37 తదుపరి త్రయోదశి జ్యేష్ఠ: సా.5.39 తదుపరి మూల వర్జ్యం: రా.1.08 నుంచి 2.38 వరకు అమృత ఘడియలు: ఉ.9.57 నుంచి 10.56 వరకు దుర్ముహూర్తం: మ.11.39 నుంచి 12.31 వరకు రాహుకాలం: మ.12.00 నుంచి 1.30 వరకు సూర్యోదయం: ఉ.5-38, సూర్యాస్తమయం: సా.6-33

మేష రాశి : ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. పెద్దల సలహాలు మేలు చేస్తాయి. వృత్తి, ఉద్యోగ రంగాల వారు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. నూతన ఒరవడికలు వ్యాపారంలో ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. స్థిరాస్తికి సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. మన పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కొన్ని సందర్భాల్లో ముక్కుసూటితనంగా వ్యవహరించడం మేలు. శివారాధన శుభప్రదం.

వృషభ రాశి : విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వస్త్రలాభం ఉంది. ఆర్థికంగా ఎదగడానికి పునాదులను నిర్మిస్తారు. విష్ణు నామాన్ని జపించండి. ఇష్టకార్యసిద్ధి ఉంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న ఫలితాలను సాధిస్తారు. విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలున్నాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. వారాంతంలో శుభ ఫలితాలున్నాయి. విష్ణు ఆరాధన మంచి ఫలితాలనిస్తుంది.

మిథున రాశి : కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. శివ నామాన్ని జపించండి. ఒక వ్యవహారంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. కొన్ని కీలకమైన పనుల్లో పురోగతి ఉంటుంది. అంచలంచెలుగా ఎదుగుతారు. స్వస్థానప్రాప్తి ఉన్నది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేవిధంగా ఉంటాయి. ఆరోగ్యం ఫర్వాలేదనిపిస్తుంది. ఆదాయం బాగుంటుంది. సూర్య అష్టోత్తరం శుభప్రదం.

కర్కాటక రాశి: ఆఫీస్ లో పదోన్నతులు గురించి జరిగే అవకాశముంది. మీ మాటలతో అధికారులను ఆకట్టుకుంటారు. కంటి లోపాలకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. నిర్ణయం తీసుకునే సామర్థ్యం ప్రయోజనకరంగా ఉంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. లేకుంటే ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశముంది.

సింహ రాశి : నూతన వ్యాపారాల్లో ప్రయోజనకరమైన మార్పులు ఉంటాయి. ఫలితంగా ఆర్థిక లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో మీకు అధికారాలు, బాధ్యతలు పెరుగుతాయి. సాయంత్రం నుంచి రాత్రి వరకు సామాజిక పనుల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సాయంత్రం సమయంలో చర్చ ఉండే అవకాశముంది. అనవసర విషయాలను పట్టించుకోకపోవడం ఉత్తమం.

కన్యా రాశి: అంతేకాకుండా మీ హక్కులు, బాధ్యతలు కూడా పెరుగుతాయి. ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. చాలాకాలంగా పెండింగులో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు. ఈ రోజు చాలా కాలంగా మీరు కలవడానికి ప్రయత్నిస్తున్న వారిని కలిసే అవకాశముంది. రాత్రి సమయంలో సరదాగా షికార్లు చేస్తారు. ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండండి.

తుల రాశి : రాజకీయంగా పలుకుబడిగల వారితో పరిచయాలు పెరుగుతాయి. పాత స్నేహితులు పలకరిస్తారు. శుభ కార్యాల విషయంలో చర్చిస్తారు. సంతానం నుంచి శుభ వార్తలు వింటారు. ఉద్యోగంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల వారు బాగా రాణిస్తారు.

వృశ్చిక రాశి : వ్యాపార లావాదేవీలు మంచి ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు చిరుద్యోగం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తారు. దూర ప్రాంతాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు. మిత్రుల నుంచి సహకారం లభిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు బిజీ అవుతారు.

ధనుస్సు రాశి : ఉద్యోగపరంగా, ఆదాయపరంగా కాలం అనుకూలంగా ఉంది. తలచిన పనులు నెరవేరుతాయి. చాలాకాలంగా చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతాల్లో ఉద్యోగం వస్తుంది. చాలావరకు రుణ బాధ నుంచి బయటపడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి.

మకర రాశి : ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కడా పెట్టుబడులు పెట్టవద్దు. ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు. నిరుద్యోగులకు ఉన్న ఊళ్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పలుకుబడిగల వారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభ వార్తలు వింటారు. వ్యాపారులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది.

కుంభ రాశి : ఆర్థిక, వ్యాపార లావాదేవీలు కుదర్చుకుంటారు. బంధుమిత్రుల రాకపోకలు అధికంగా ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారులకు వాతావరణం అనుకూలంగా ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

మీన రాశి : స్పష్టమైన ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయండి. గొప్ప ఆర్ధిక లాభాలున్నాయి. పట్టుదలతో వ్యవహరించి పనులను పూర్తిచేస్తారు. సమయానికి సహాయం చేసేవారున్నారు. ఇష్టదైవాన్ని సందర్శిస్తే మంచి జరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. తల పెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు కొంటారు. బంధువుల రాకపోకలు ఉంటాయి.

Web TitleDaily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu Today 21st July 2021
Next Story