Daily Horoscope: ఈరోజు మీరోజు! ఈ రాశి వారికి బాకీలు వసూలవుతాయి

Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam
x
రాశిఫలాలు
Highlights

Daily Horoscope: ఈ రోజు వివిధ రాశుల వారి దినఫలాలు

Daily Horoscope: శ్రీ శార్వరి నామ సంవత్సరం| సోమవారం ఉత్తరాయణం| శిశిర ఋతువు మాఘ మాసం| సూర్యోదయం : 6.12 | సూర్యాస్తమయం సా.6.06| తిథి శు.విదియ సా.గం.5.27 వరకు| తదుపరి తదియ |నక్షత్రం రేవతి రా.328 వరకు| తదుపరి అశ్వనీ|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం ప.2.26 నుంచి 4.13 వరకు| దుర్ముహూర్తం ప.12.32 నుంచి 1.20 వరకు తదుపరి మ.02.54 నుంచి 03.45 వరకు| అమృతఘడియలు రా.12.51 వరకు| కరణం కౌలవ సా.5.21| యోగం శుక్లం ఉ.గం.7.02ల వరకు

ఈ రోజు రాశిఫలాలు

మేషరాశి: పనులలో స్వల్ప ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగ మార్పులు. సోదరులతో మాటపట్టింపులు.

వృషభరాశి: సన్నిహితులతో సఖ్యత. విలువైన వస్తువులు సేకరిస్తారు. సంఘంలో గౌరవం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగోన్నతి. దైవదర్శనాలు.

మిథునరాశి: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుసుకుంటారు. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కర్కాటకరాశి: వ్యయప్రయాసలు. అనుకోని ఖర్చులు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. దూరపు బంధువుల కలయిక. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు.

సింహరాశి: రుణయత్నాలు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం.

కన్యారాశి: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. పలుకుబడి పెరుగుతుంది.ధనలాభం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

తులారాశి: వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఒప్పందాలు వాయిదా. శ్రమా«ధిక్యం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు.

వృశ్చికరాశి: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. పోటీపరీక్షల్లో విజయం. విందువినోదాలు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

ధనుస్సురాశి: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. బ«ంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.

మకరరాశి: కొత్త ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. అత్యంత కీలక సమాచారం. వృత్తి, వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. విందువినోదాలు.

కుంభరాశి: సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు నూతనోత్సాహం.

మీనరాశి: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలలో మార్పులు. ఉద్యోగులకు బాధ్యతలు అధికం. ఆరోగ్యభంగం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు.


- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ 9381881581


Show Full Article
Print Article
Next Story
More Stories