Daily Horoscope: ఈ రోజు మీరోజు! ఈ రాశివారికి శ్రమ ఫలిస్తుంది

Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam
x

Daily Horoscope 

Highlights

Daily Horoscope: వివిధ రాశులవారి ఫలితాలు.

Daily Horoscope: శుక్రవారం| మార్చి 12-03-2021 | శ్రీ శార్వరి నామ సంవత్సరం| ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసం| తిథి బ.చతుర్థశి ప.గం.2.42 వరకు| తదుపరి అమావాస్య |నక్షత్రం శతభిషం రా.10.34 వరకు| తదుపరి పూర్వభధ్ర| వర్జ్యం శేషం ఉ.6.15 నుంచి 6.57వరకు| దుర్ముహూర్తం సూర్యోదయం నుంచి ఉ.7.58 వరకు| అమృతఘడియలు ప.03.20 |యమగండం ప.1.30 నుంచి 03.03 వరకు|శుభసమయం సా.4.00|కరణం వనిక్ ప.3.08| యోగం సాధ్యం ఉ.గం.7.48| సూర్యోదయం : 6.13 | సూర్యాస్తమయం సా.6.05| రాహుకాలం : ఉ. 09.00 నుంచి 10:30 వరకు|

ఈ రోజు రాశిఫలాలు

మేషరాశి: కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.

వృషభరాశి: ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరాస్తివృద్ధి. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.

మిథునరాశి: పనుల్లో అవాంతరాలు. రాబడికి మించిన ఖర్చులు. బంధువులతో తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు కొద్దిపాటి చికాకులు.

కర్కాటకరాశి: ఆస్తి వివాదాలు. ఆర్థిక లావాదేవీలలో ఒడిదుడుకులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవరోధాలు. అనారోగ్యం.

సింహరాశి: నూతన విద్యావకాశాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. కళాకారులకు సత్కారాలు.

కన్యారాశి: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు.

తులారాశి: ఇంటర్వ్యూలు అందుకుంటారు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆస్తిలాభం కలుగుతుంది. వ్యాపారాలలో అనుకూల పరిస్థితి. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి.

వృశ్చికరాశి: దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని పనుల్లో ఆటంకాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలలో కొన్ని సమస్యలు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

ధనుస్సురాశి: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం. భూ, వాహనలాభాలు. ఉద్యోగాలు, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

మకరరాశి: కార్యజయం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.

కుంభరాశి: ఆదాయానికి మించి ఖర్చులు. బధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు. ఉద్యోగాలు, వ్యాపారాలలో ఆటంకాలు. శ్రమాధిక్యం.

మీనరాశి: అనుకోని ప్రయాణాలు. బంధువులతో కొద్దిపాటి విభేదాలు. పనుల్లో జాప్యం. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు ఎదురవుతాయి.


- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Show Full Article
Print Article
Next Story
More Stories