Top
logo

Daily Horoscope: ఈరోజు మీరోజు! సెప్టెంబర్ 12 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! సెప్టెంబర్ 12 పంచాంగం, దినఫలాలు!
X
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం | 12 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | దశమి (రా.11-18 వరకు) తదుపరి ఏకాదశి | ఆర్ద్ర నక్షత్రం (మ.12-53 వరకు) తదుపరి పునర్వసు | అమృత ఘడియలు: లేవు | వర్జ్యం: రా.1-07 నుంచి 2-45 వరకు | దుర్ముహూర్తం: ఉ.5-50 నుంచి 7-27 వరకు | రాహుకాలం: ఉ.9-00 నుంచి 10-30 వరకు | సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-04

ఈరోజు రాశి ఫలాలు

మేషం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. దూరప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృషభం: శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి కనిపిస్తుంది.

మిథునం: వ్యవహారాలు కొంత మందగిస్తాయి. నిర్ణయాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. బంధువర్గంతో విభేదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. పలుకుబడి పెరుగుతుంది. ఆకస్మిక ధన, వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు.

సింహం: నిరుద్యోగులకు కీలక సమాచారం. విందువినోదాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

కన్య: అనుకున్న పనుల్లో అవాంతరాలు. తొందరపాటు నిర్ణయాలు వద్దు. బంధుమిత్రులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో సామాన్యస్థితి.

తుల: రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మికచింతన. కొన్ని పనులు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

వృశ్చికం: బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. నూతన ఉద్యోగ, విద్యావకాశాలు. ఆస్తిలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

ధనుస్సు: చిన్ననాటి మిత్రుల కలయిక. పరిచయాలు పెరుగుతాయి. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో క్లిష్టపరిస్థితుల నుంచి బయటపడతారు.

మకరం: కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. మిత్రుల నుంచి సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింతగా బాధ్యతలు.

కుంభం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. పనుల్లో అవాంతరాలు. ఇంటాబయటా సమస్యలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

మీనం: వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి.బంధుమిత్రులతో వివాదాలు సర్దుకుంటాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పురోగతి.

Web Titledaily-horoscope-in-telugu-rasi-phalalu-panchangam-dinaphalaalu-today-12th-September
Next Story