Daily Horoscope: ఈరోజు మీరోజు! ఆగస్ట్ 07 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! ఆగస్ట్ 07 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం, 07ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం చవితి (రాత్రి 12-17 వరకు) తదుపరి పంచమి; పూర్వాభాద్ర నక్షత్రం (ఉ. 9-24 వరకు) తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం, అమృత ఘడియలు (తె. 3-20 నుంచి ఉ. 6-06 వరకు), వర్జ్యం (రా. 11-37 నుంచి 1-22 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 8-16 నుంచి 9-07 వరకు) రాహుకాలం (ఉ. 10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-29

ఈరోజు రాశి ఫలాలు

మేషం: నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి.వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు.

వృషభం: చిన్ననాటి మిత్రుల నుంచి ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. పనుల్లో పురోగతి. ఇంటాబయటా అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి . ఉద్యోగాలలో పదోన్నతులు.

మిథునం: సన్నిహితులతో స్వల్ప విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమ తప్పదు. ఆలయాలు సందర్శిస్తారు.ముఖ్య పనులు వాయిదా. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

కర్కాటకం: సన్నిహితులతో విభేదాలు. ప్రయాణాలు వాయిదా. పనుల్లో ప్రతిష్ఠంభన. అనారోగ్యం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు తప్పకపోవచ్చు.

సింహం: పూర్వపు మిత్రుల నుంచి పిలుపు. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. పనుల్లో విజయం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

కన్య: మిత్రులు, కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఏ పని చేపట్టినా ముందుకు సాగదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో మార్పులు.

తుల: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు. వాహనయోగం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో విశేష గుర్తింపు.

వృశ్చికం: వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో ఆటంకాలు. అనుకోని ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగాలలో నిదానం అవసరం.

ధనుస్సు: వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆస్తి విషయంలో సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. నూతన ఒప్పందాలు. వ్యాపారాలు విస్తరణలో విజయం. ఉద్యోగాలలోసమర్థత చాటుకుంటారు.

మకరం: చిరకాల మిత్రులను కలుసుకుంటారు. నూతన ఉద్యోగలాభం. ప్రముఖులతో కీలక విషయాలు చర్చిస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

కుంభం: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. అనారోగ్యం. సోదరులతో ఆస్తి వివాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.

మీనం: సన్నిహితులతో వివాదాలు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. శ్రమ మరింత పెరుగుతుంది. పనులలో అవాంతరాలు. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి

Show Full Article
Print Article
Next Story
More Stories