Daily Horoscope: ఈరోజు మీరోజు! ఆగస్ట్ 06 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! ఆగస్ట్ 06 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం, 06 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం తదియ(రాత్రి 12-15 వరకు) తదుపరి చవితి; శతభిష నక్షత్రం (ఉ.11-18 వరకు) తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం, అమృత ఘడియలు (తె. 3-20 నుంచి 5-02 వరకు), వర్జ్యం (సా. 6-18 నుంచి 8-03 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 11-40 నుంచి 12-31 వరకు) రాహుకాలం (మ. 01-30 నుంచి 03-00 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-29

ఈరోజు రాశి ఫలాలు

మేషం: వ్యవహారాలలో పురోగతి. వస్తులాభాలు. మిత్రులతో వివాదాలు సర్దుకుంటాయి. నూతన ఉద్యోగాలు దక్కించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృషభం: పనుల్లో ప్రతిష్ఠంభన. దూరప్రయాణాలు. ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం.

మిథునం: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యవహారాలలో జాప్యం. బంధుమిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.

కర్కాటకం: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనులు చకచకా సాగుతాయి. వస్తు, వస్త్రలాభాలు. స్థిరాస్తివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు విస్తృతమవుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

సింహం: మిత్రులు, బంధువులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దైవచింతన. వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి. ఉద్యోగాలలో లేనిపోని ఇబ్బందులు.

కన్య: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. చర్చలు సఫలం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు.

తుల: మిత్రులు, బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో జాప్యం. శ్రమాధిక్యం. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు.

వృశ్చికం: దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు. ముఖ్య నిర్ణయాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులలో పురోగతి సాధిస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

ధనుస్సు: మిత్రుల నుంచి కీలక సమాచారం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులు సజావుగా సాగుతాయి. నూతన ఒప్పందాలు. విందువినోదాలు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

మకరం: వ్యవహారాలు మందగిస్తాయి. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. అనారోగ్యం. శ్రమ తప్పదు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

కుంభం: మిత్రులతో వివాదాలు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. ఆరోగ్యభంగం. కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. సోదరుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత ఒత్తిడులు.

మీనం: శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. వాహనయోగం. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది

Show Full Article
Print Article
Next Story
More Stories