Top
logo

Daily Horoscope: ఈరోజు మీరోజు! ఆగస్ట్ 02 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! ఆగస్ట్ 02 పంచాంగం, దినఫలాలు!
X
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం, 02 ఆగస్ట్, 2020: శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం చతుర్దశి (రాత్రి 9-30 వరకు) తదుపరి పూర్ణిమ; పూర్వాషాఢ నక్షత్రం (ఉ. 7-27 వరకు) తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం, అమృత ఘడియలు (రాత్రి 11-16 నుంచి 2-53 వరకు), వర్జ్యం (మ. 3-32 నుంచి 5-10 వరకు) దుర్ముహూర్తం ( సా. 4-47 నుంచి 5-38 వరకు) రాహుకాలం (సా. 4-30 నుంచి 6-00 వరకు) సూర్యోదయం ఉ.5-42 సూర్యాస్తమయం సా.6-30

ఈరోజు రాశి ఫలాలు

మేషం: సన్నిహితులు, మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. పనుల్లో జాప్యం. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

వృషభం: ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. దూరప్రయాణాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

మిథునం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. పా తమిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

కర్కాటకం: ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. నూతన వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం.

సింహం: మిత్రుల నుంచి ఒత్తిళ్లు. అనుకోని ప్రయాణాలు. ఉద్యోగావకాశాలు నిరాశ పరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

కన్య: ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. బంధువుల కలయిక. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

తుల: కొత్త వ్యక్తుల పరిచయాలు. సంఘంలో గౌరవం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. కాంట్రాక్టర్లకు అనుకూలం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృశ్చికం: పనుల్లో ప్రతిబంధకాలు. ప్రయాణాలు వాయిదా. బంధుమిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. వ్యాపారాలు కొంత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

ధనుస్సు: పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వస్తులాభాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

మకరం: సన్నిహితుల నుంచి కొద్దిపాటి సమస్యలు. ప్రయాణాలు వాయిదా. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు నిరుత్సాహం. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కుంభం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ. వాహనయోగం. నూతన ఒప్పందాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

మీనం: సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది.

Web Titledaily-horoscope-in-telugu-rasi-phalalu-panchangam-dinaphalaalu-today-02nd-August
Next Story