Top
logo

Daily Horoscope: ఈరోజు మీరోజు! ఆగస్ట్ 01 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! ఆగస్ట్ 01 పంచాంగం, దినఫలాలు!
X
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం, 01 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం త్రయోదశి (రాత్రి 9-48 వరకు) తదుపరి చతుర్దశి; మూల నక్షత్రం (ఉ. 7-48 వరకు) తదుపరి పూర్వాషాఢ నక్షత్రం, అమృత ఘడియలు (రాత్రి 2-43 నుంచి 4-17 వరకు), వర్జ్యం (ఉ. 6-15 నుంచి 7-48 వరకు తిరిగి సా. 5-15 నుంచి 6-50 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 5-42 నుంచి 7-24 వరకు తిరిగి మ. 12-32 నుంచి 1-23 వరకు) రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.5-42 సూర్యాస్తమయం సా.6-31

ఈరోజు రాశి ఫలాలు

మేషం: అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిళ్లు. బంధువర్గంతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

వృషభం: పరిచయాలు విస్తరిస్తాయి. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. వ్యవహారాలలో పురోగతి. వాహనయోగం. దైవదర్శనాలు. వ్యాపారాలు కొంత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

మిథునం: మిత్రులు, బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉంటాయి.

కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. నూతనంగా చేపట్టిన పనులు పూర్తి. సంఘంలో ఆదరణ. ఆహ్వానాలు అందుతాయి. వాహనయోగం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సతాహం.

సింహం: మిత్రులతో వివాదాలు. ఆరోగ్యభంగం. కుటుంబసభ్యులతో వివాదాలు. దూరప్రయాణాలు. ఉద్యోగయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

కన్య: నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆకస్మిక ధనలబ్ధి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

తుల: సన్నిహితుల నుంచి కీలక సమాచారం. నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారవృధ్ధి. ఉద్యోగాలలో అనుకూలత.

వృశ్చికం: రుణదాతల ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. అనారోగ్యం. మిత్రులతో వివాదాలు. దైవచింతన. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం తప్పదు.

ధనుస్సు: కొత్త రుణాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా. పనుల్లో తొందరపాటు. శ్రమాధిక్యం. బంధువర్గంతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో మార్పులు.

మకరం: కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

కుంభం: కొత్త విషయాలు తెలుస్తాయి. మిత్రులు, బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆర్థిక ప్రగతి. వాహనయోగం. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

మీనం: వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనారోగ్యం. శ్రమ తప్పదు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో ఇష్టంలేని మార్పులు ఉంటాయి.

Web Titledaily-horoscope-in-telugu-rasi-phalalu-panchangam-dinaphalaalu-today-01st-August
Next Story