Viral Video: తల్లి వెనుకే వెళుతున్న ఒక చిన్న ఏనుగు పిల్ల ఏం చేసిందో చూస్తే.. కచ్చితంగా షాక్..!

Watch: Baby Elephant Disposes Garbage Properly, Wins Hearts Online
x

Viral Video: తల్లి వెనుకే వెళుతున్న ఒక చిన్న ఏనుగు పిల్ల ఏం చేసిందో చూస్తే.. కచ్చితంగా షాక్..!

Highlights

Viral Video: ఈ మధ్యకాలంలో ఏనుగులకు సంబంధించిన చాలా వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Viral Video: ఈ మధ్యకాలంలో ఏనుగులకు సంబంధించిన చాలా వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఒక తల్లి ఏనుగు వెనకాల పిల్ల ఏనుగు వెళుతున్న వీడియో ఒకటి వైరల్ అయింది. ఇక నెటిజన్లు ఈ ఏనుగు పిల్లను చూసి మనమంతా నేర్చుకోవాలంటూ కామెంట్లు పెట్టారు. ఇంతకీ ఆ ఏనుగు పిల్ల ఏం చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.

సంస్కారం అనేది తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి అని అంటారు. కానీ ఈ మధ్య కాలంలో తల్లిదండ్రుల నుంచి పిల్లలు నేర్చుకునేది ఏదీ కనిపించడంలేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువమంది పిల్లలకు చెడు తొందరగా అలవాటు పడుతుంది. కానీ మంచి.. చాలా దూరం అయిపోయింది. ఇక గుడ్ మ్యానెర్స్, గుడ్ కల్చర్ విషయానికొస్తే ఎక్కడో అక్కడ పిల్లలు కనిపిస్తున్నారు. ఈ విషయం ఈ మధ్య కాలంలో చాలామంది తల్లిదండ్రులను బాధిస్తున్న విషయం. అయితే ఇది ఇలా ఉంటే, రోడ్డుపైన వెళుతున్న తల్లి ఏనుగు వెంబడే పిల్ల ఏనుగు కూడా వెళుతుంది. అయితే అకస్మాత్తుగా రోడ్డుపై కనిపించిన చెత్తను పిల్ల ఏనుగు చూసింది. ఇంక తన తొండంతో ఆ చెత్తను చూసి అక్కడపక్కనే ఉన్న డస్ట్ బిన్‌లో వేసి, మళ్లీ తల్లి వెంట వెళ్లిపోయింది.

ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ పిల్లకున్న మ్యానర్స్‌ ఇప్పటితరానికి లేకుండా పోయిందే అంటూ బాధపడుతుండటం విశేషం. ఈ వీడియోపైన క్యాప్షన్ కూడా బేబీ ఏనుగు పిల్ల డస్ట్ బిన్‌ని ఉపయోగించింది.. మరి మనం ఎందుకు ఉపయోగంచలేదు? అంటూ ప్రశ్నిస్తారు. నిజమే కదా.. అక్కడ డస్ట్ బిన్ పక్కన ఎవరో చెత్తను పడేసి వెళ్లిపోయారు అతను డస్ట్ బిన్‌ ను ఉపయోగించలేదు. కానీ ఆ తర్వాత వచ్చిన ఏనుగు పిల్ల ఆ చెత్తను తీసి డస్ట్ బిన్‌లో వేసింది. సెకన్లపాటు ఈ వీడియో ఎంతోమందిని ఆలోచింపచేసింది. అందుకే సోషల్ మీడియా ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories