Viral Video: దాబాలో చపాతి తింటున్నారా.? ఈ వీడియో చూస్తే దడుసుకోవాల్సిందే

Viral Video
x

Viral Video: దాబాలో చపాతి తింటున్నారా.? ఈ వీడియో చూస్తే దడుసుకోవాల్సిందే

Highlights

Viral Video: బయటి ఫుడ్‌ తినడం ఆరోగ్యానికి మంచిది కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Viral Video: బయటి ఫుడ్‌ తినడం ఆరోగ్యానికి మంచిది కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే మనలో చాలా మంది బిజీ లైఫ్‌ కారణంగానో, రుచి కోసమో అని బయట దొరికే ఆహారాన్ని తినడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే కొంత మంది నిర్వాహకులు వంట చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ప్రజల ప్రాణాలు ఏమైపోతే మాకేంటి అన్న రీతిలో వ్యవహరిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఓ సంఘటనకు సంబంధించి వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటా వీడియో.? అందులో ఏముందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

ఓ వ్యక్తి ధాబాలో చపాతీ చేసేందుకు పిండిని రడీ చేస్తున్నాడు. ఓ వైపు కస్టమర్లు భోజనం చేస్తున్నారు. మరో వైపు ఓ గోడ పక్కన అపరిశుభ్ర ప్రదేశంలో పిండిసి పిసుకుతున్నాడు. పెద్ద పాత్రలో పిండిని వేసి, అపరిశుభ్ర చేతులతో దాన్ని అటూ.. ఇటూ తిప్పుతూ ఉంటాడు. మధ్యలో మగ్‌లో ఉన్న నీటిని పోస్తున్నాడు. అయితే ఆ మగ్‌ అత్యంత అపరిశుభ్రంగా ఉంది. అలా పిసికిన పిండిని టేబుల్‌పై వేసి, ఓ మాసిన బట్టను కప్పాడు. వీడియో తీస్తున్న వ్యక్తి అతడి వద్దకు వెళ్లి.. చపాతీ పిండి సిద్ధం చేస్తున్న విధానంపై నిలదీస్తాడు. ఇందుకు అతను కాసేపు మౌనంగా ఉండి.. తర్వాత సమాధానం చెప్పకుండా దూరంగా వెళ్లిపోతాడు.

ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరీ ఇంత దారుణామా.? ప్రజలు ఏమై పోయినా పర్లేదు కానీ డబ్బులు వస్తే చాలా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇంకోసారి ఇలాంటి హోటల్స్‌లో చపాతీ తినాలంటే భయపడే పరిస్థితి వచ్చింది అంటూ మరో యూజర్‌ స్పందించారు. మొత్తం మీద ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది.



Show Full Article
Print Article
Next Story
More Stories