Viral Video: విధి ఓ ఆట ఆడింది.. దొంగతనానికి వెళ్లి ఖాళీ చేతులతో ‘బతుకుజీవుడా’ అంటూ పరారైన దొంగ!

చోరీకి కూడా అదృష్టం కలసిరావాలన్న మాట నిజమేనేమో! లేదంటే ఏ ముహూర్తాన చూసుకుని దొంగతనానికి బయలుదేరాడో కానీ, విధి మాత్రం తన ఆట ఆడేసింది. తాజాగా ఓ ఫన్నీ దొంగతన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Ramya Vegirouthu
Updated on: 28 July 2025 7:15 PM IST
Viral Video: విధి ఓ ఆట ఆడింది.. దొంగతనానికి వెళ్లి ఖాళీ చేతులతో ‘బతుకుజీవుడా’ అంటూ పరారైన దొంగ!
X

Viral Video: విధి ఓ ఆట ఆడింది.. దొంగతనానికి వెళ్లి ఖాళీ చేతులతో ‘బతుకుజీవుడా’ అంటూ పరారైన దొంగ!

చోరీకి కూడా అదృష్టం కలసిరావాలన్న మాట నిజమేనేమో! లేదంటే ఏ ముహూర్తాన చూసుకుని దొంగతనానికి బయలుదేరాడో కానీ, విధి మాత్రం తన ఆట ఆడేసింది. తాజాగా ఓ ఫన్నీ దొంగతన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చోరీ చేయబోతూ అదృష్టం మోసగించిన ఈ దొంగ పరిస్థితి చూసి నెటిజన్లు నవ్వుతూనే ఉన్నారు.

ఓ దొంగ తన స్కూటర్‌పై వచ్చి, దుకాణం ముందు పెట్టిన బాక్స్‌పై కన్నేశాడు. తెలివిగా దాన్ని స్కూటర్‌పై ఎక్కించుకొని తప్పించుకోవాలని ప్రయత్నించాడు. అయితే స్కూటర్ స్టార్ట్ చేసిన వెంటనే తన బ్యాలెన్స్ కోల్పోయి... స్కూటర్, బాక్స్ ఇద్దరూ నేలకే కూలిపోయాయి!

అయినా నొప్పిని లెక్కచేయకుండా వస్తువులు పుంజుకుంటూ మళ్లీ స్కూటర్ ఎక్కాడు. కానీ ఆ స్కూటర్ అతడికి సహకరించక మళ్ళీ పడిపోయింది. చివరికి చాలా ఇబ్బందులు పడిన తర్వాత, కొంత దూరం వెళ్లగలిగాడు. కాని విధి అనుకున్నదే జరగింది – స్కూటర్ మరోసారి జారిపడి రోడ్డుపై పడిపోయాడు.

తుది పరిణామంగా, స్కూటర్‌ను అక్కడే వదిలేసి, ఖాళీ చేతులతో 'బతుకుజీవుడా' అంటూ పరారయ్యాడు! దొంగతనం అర్ధాంతరంగా ఆగిపోవడంతో పాటుగా అతని పరుగు కూడా బ్లాక్‌ బస్టర్ కామెడీ సీన్‌ అయ్యింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం తెగ కామెంట్లు చేస్తున్నారు –

“ఈ దొంగకు ఎవరి శాపమో బాగా తగిలిందే”,

“ఇవేంటీ.. ఒకేరోజు ఎవడికి ఈ స్థాయి దురదృష్టం వస్తుంది?”,

“దొంగతనం ఫెయిలైందో బాగుంది.. కానీ కామెడీ పక్కాగా డెలివర్ చేశాడు!”



Ramya Vegirouthu

Ramya Vegirouthu

Next Story