Viral Video: యముడు లీవ్‌లో ఉన్నాడు కాబోలు.. ఈ వీడియో చూస్తే మీరూ ఇదే అంటారు..!

Viral Video: యముడు లీవ్‌లో ఉన్నాడు కాబోలు.. ఈ వీడియో చూస్తే మీరూ ఇదే అంటారు..!
x
Highlights

Viral Video: అదృష్టం.. చాలా మంది దీనిని పెద్దగా నమ్మరు. కష్టంతో పనిచేస్తేనే విజయం వస్తుందని అంటుంటారు.

Viral Video: అదృష్టం.. చాలా మంది దీనిని పెద్దగా నమ్మరు. కష్టంతో పనిచేస్తేనే విజయం వస్తుందని అంటుంటారు. అయితే కొన్ని సంఘటనలు చూస్తుంటే కష్టంతో పాటు అదృష్టం కూడా కచ్చితంగా ఉండాల్సిందేనని చెబుతుంటాయి. ఎంతటి ప్రమాదం ఎదురైనా అదృష్టం ఉంటే ప్రాణాలకు ఎలాంటి ఢోకా ఉండదని చెప్పేందుకు ఓ వీడియో సాక్ష్యంగా నిలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఏంటా వీడియో? అందులో ఏముందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

రోడ్డుపై బైక్‌ నడిపించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు. వాహనాలను ఓవర్‌ టేక్‌ చేసే విషయంలో ముందు వెనకాల చూసుకొని వెళ్లాలని రోడ్డు భద్రతా నిబంధనల్లో వివరిస్తారు. అయితే ఓ ముగ్గురు యువకులు వీటన్నింటినీ గాలికి వదిలేసి ఎంచక్కా బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ చేశారు. హైవపేపై రయ్ రయ్‌ మంటూ దూసుకెళ్లారు. అంతలోనే ఎదురుగా ఓ లారీ కారును ఓవర్‌ టేక్‌ చేస్తోంది. అయితే ఆ కారు, లారీ మధ్య నుంచి దూసుకెళ్లాలనుకున్నాడు. అది సాధ్యం కాదని తెలిసినా దూసుకొచ్చాడు.

అయితే అంతలోనే బైక్‌ పై కూర్చున్న ఓ యువకుడి కాలు కారుకు తగిలింది. దీంతో ముగ్గురు యువకులు ఒక్కసారిగా లారీ కింద పడ్డారు. కచ్చితంగా ప్రాణాలు పోయి ఉంటాయని అనుకుంటున్నారు కదూ! అయితే ఆ ముగ్గురిలో ఒక్కరికీ కూడా ఎలాంటి గాయం కాలేదు. ఇదంతా వెనకాల కారులో వస్తున్న వారు వీడియో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది వీడియో కాస్త తెగ వైరల్‌ అయ్యింది. నిజంగానే వాళ్లకు ఈ భూమ్మీద ఇంకా నూకలు ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. బహుశా యముడు సెలవుల్లో ఉండి ఉండొచ్చు. అందుకే ఇలా ప్రాణాలతో బయటపడ్డారు. అని మరికొందరు స్పందిస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. మరెందుకు ఆలస్యం ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.


Show Full Article
Print Article
Next Story
More Stories