Viral Video: నడీ రోడ్డుపై రెచ్చిపోయిన ప్రేమ జంట.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

Viral Video: నడీ రోడ్డుపై రెచ్చిపోయిన ప్రేమ జంట.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
x

Viral Video: నడీ రోడ్డుపై రెచ్చిపోయిన ప్రేమ జంట.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

Highlights

Viral Video: ఇద్దరి మధ్య ఉంటే అది రొమాన్స్‌, నలుగురిలో చేస్తే నాన్సెన్స్‌.. ఇదిగో ఈ నాన్సెన్స్‌ ఇప్పుడు ఎక్కువైపోతోంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వాలనో, తలతిక్కల వ్యవహారమో కారణం ఏదైనా ఇటీవల కొందరు చేస్తున్న పనులు చూస్తుంటే సభ్యసమాజం తలదించుకునేలా ఉంటున్నాయి.

Viral Video: ఇద్దరి మధ్య ఉంటే అది రొమాన్స్‌, నలుగురిలో చేస్తే నాన్సెన్స్‌.. ఇదిగో ఈ నాన్సెన్స్‌ ఇప్పుడు ఎక్కువైపోతోంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వాలనో, తలతిక్కల వ్యవహారమో కారణం ఏదైనా ఇటీవల కొందరు చేస్తున్న పనులు చూస్తుంటే సభ్యసమాజం తలదించుకునేలా ఉంటున్నాయి. అందరూ చూస్తున్నారన్న సంగతి తెలిసి కూడా రెచ్చిపోతున్నారు. హద్దు మీరి ప్రవర్తిస్తూ నడిరోడ్డు మీదే వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఓ సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది.

ఓ కపుల్‌ బైక్‌పై వెళ్తున్నారు. అయితే మాములుగా వెళ్తే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదు. కానీ ఈ జంట చేసిన పిచ్చి పనికి నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతున్నారు. బెంగళూరలో ఒక యువకుడు తన బైక్ ఫ్యూయిల్ ట్యాంక్‌పై ఒక యువతిని కూర్చోబెట్టుకుని.. ఆమెను కౌగిలించుకుంటూ బైక్‌ డ్రైవ్‌ చేస్తున్నాడు. ప్రపంచంలో సంబంధం లేదన్నట్లు రయ్‌ రయ్‌ మంటూ వెళ్తున్నాడు. దీనంతటినీ అక్కడే రోడ్డుపై ఉన్న కొందరు వీడియోగా తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

ఇంకేముంది ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవ్వడం మొదలైంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతున్నారు. రొమాన్స్‌ అనేది అందంగా ఉండాలని కానీ ఇలా రోడ్లపై చేసుకోకూడదని కొందరు కామెంట్స్‌ చేస్తుంటే. మరికొందరు మాత్రం వీరిని వెంటనే కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో పోలీసులు ఇప్పటికే ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.



Show Full Article
Print Article
Next Story
More Stories