Viral News: 18వ అంతస్తు నుంచి పడిపోయిన 3 ఏళ్ల బాలుడు.. ప్రాణాలతో బయటపడిన కథ చూస్తే ఆశ్చర్యం పోతుంది!

Viral News: 18వ అంతస్తు నుంచి పడిపోయిన 3 ఏళ్ల బాలుడు.. ప్రాణాలతో బయటపడిన కథ చూస్తే ఆశ్చర్యం పోతుంది!
x

Viral News: 18వ అంతస్తు నుంచి పడిపోయిన 3 ఏళ్ల బాలుడు.. ప్రాణాలతో బయటపడిన కథ చూస్తే ఆశ్చర్యం పోతుంది!

Highlights

చైనాలో ఒక మూడేళ్ల చిన్నారి 18వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ కిందపడిపోయాడు. ఈ పరిణామం విని ఏదైనా విషాద ఘటన అనిపించొచ్చు. కానీ.. అతడు ప్రాణాలతో బయటపడటం విని షాక్ అవ్వాల్సిందే. ఈ సంఘటన జెజియాంగ్ ప్రావిన్స్‌లోని హాంగ్‌జౌలో జూలై 15న జరిగింది.

పిల్లవాడు ఇంట్లో ఒంటరిగా నిద్రపోతుండగా, కుటుంబ సభ్యులు షాపింగ్‌కు వెళ్లారు. తలుపు వేసి వెళ్లిన తరువాత, ఆ చిన్నారి అపార్ట్‌మెంట్ బాల్కనీకి చేరి ఓ దశలో అంతస్తు పై నుంచి కిందపడ్డాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అతడు కిందపడ్డ సమయంలో భవనానికి దగ్గరలో ఉన్న చెట్టు కొమ్మలపై పడిపోవడంతో తీవ్ర గాయాల నుంచి తృటిలో తప్పించుకున్నాడు.

ఒక ఆజ్ఞాత వ్యక్తి కింద చిన్నారి పడి ఉండటం గమనించి వీడియో తీసి భవన నిర్వహణ బృందానికి పంపాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని బాలుడిని హాస్పిటల్‌కు తరలించారు. వైద్య పరీక్షల్లో బాలుడికి ఎడమ చేయి, వెన్ను భాగంలో గాయాలున్నాయని తేలింది. కానీ తలకు ఏమీ కాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

తన కొడుకును ప్రాణాలతో నిలిపిన చెట్టుకు కృతజ్ఞతగా బాలుడి తండ్రి ఝు, ఆ చెట్టును ఎర్ర పూలతో అలంకరించాడు. “ఆ చెట్టు లేకపోయి ఉంటే నా కుమారుడిని కోల్పోయేవాడిని,” అంటూ భావోద్వేగంతో చెప్పాడు.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, వివరాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చిన్నారి అదృష్టం, చెట్టు రక్షణ చేసిన తీరుపై నెటిజన్లు విస్తుపోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories