Fathers Day: ఇవాళ ఫాదర్స్ డే... నాన్న ఓ భరోసా.. నాన్నంటే ధైర్యం... నాన్నంటే సంతోషం... నాన్నంటే ఓ నమ్మకం..

Fathers Day: నాన్నంటే ధైర్యం... నాన్నంటే సంతోషం... నాన్నంటే ఓ నమ్మకం..

Jyothi
Published on: 18 Jun 2023 7:36 AM IST
Today is Fathers Day
X

Fathers Day: ఇవాళ ఫాదర్స్ డే... నాన్న ఓ భరోసా.. నాన్నంటే ధైర్యం... నాన్నంటే సంతోషం... నాన్నంటే ఓ నమ్మకం.. 

Fathers Day: తల్లి దండ్రులు ప్రత్యక్ష దైవాలు.. అమ్మ నవమాసాలు మోసి బిడ్డకు ప్రాణంపోస్తే... ఆ బిడ్డ భవిష్యత్తు భారాన్ని భుజాలకెత్తుకునేది నాన్న.. చిన్ని పాదాలతో తన గుండెలపై తంతే పొంగిపోతాడు. ముద్దుముద్దుగా మాట్లాడితే మురిసిపోతాడు. కేరింతలు కొడుతూ తప్పటడుగులు వేస్తుంటే... తానే ప్రపంచాన్ని జయించానని అనుకుంటాడు. నీ సంతోషం చూసి తానూ చిన్నపిల్లాడైపోతాడు. అనుక్షణం నీ గురించే ఆలోచిస్తూ... నీకై పరితపించే వ్యక్తి నాన్న. అనునిత్యం నిన్ను కళ్లల్లో పెట్టుకుని.. కాపుకాసే వ్యక్తి నాన్న.

కష్టాలను అనుభవిస్తూ.. సవాళ్లను అధిగమిస్తూ... అనుక్షణం బిడ్డల ఎదుగుదలే... తన విజయంగా భావించి మురిసిపోతుంటాడు.. నాన్నంటే ధైర్యం... నాన్నంటే సంతోషం... నాన్నంటే ఓ నమ్మకం. నాన్నంటే సమాజంలో మనల్ని ముందుకు నడిపించే నేస్తం. ఆయనే మన సమస్తం... బిడ్డల భవిష్యత్తుకోసం పరితపించే నాన్నలకు ఇవాళ ఫాదర్స్ డే శుభాకాంక్షలు.

Jyothi

Jyothi

Next Story