Saiyara Movie: సైయారా సినిమా చూసి ఇద్దరు యువకుల గొడవ.. అమ్మాయి కోసం బాగా కొట్టుకున్నారట! వీడియో వైరల్

Saiyara Movie: సైయారా సినిమా చూసి ఇద్దరు యువకుల గొడవ.. అమ్మాయి కోసం బాగా కొట్టుకున్నారట! వీడియో వైరల్
x

Saiyara Movie: సైయారా సినిమా చూసి ఇద్దరు యువకుల గొడవ.. అమ్మాయి కోసం బాగా కొట్టుకున్నారట! వీడియో వైరల్

Highlights

గత వారం థియేటర్లలో విడుదలైన బాలీవుడ్ చిత్రం ‘సైయారా’ సంచలనాలు సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతున్న ఈ సినిమా ఇప్పటికే రూ.165.46 కోట్లు వసూలు చేసింది. యూత్ ఎక్కువగా థియేటర్లకు వెళ్లి చూస్తుండగా, కొందరు థియేటర్‌లో ఏడుస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి.

గత వారం థియేటర్లలో విడుదలైన బాలీవుడ్ చిత్రం ‘సైయారా’ సంచలనాలు సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతున్న ఈ సినిమా ఇప్పటికే రూ.165.46 కోట్లు వసూలు చేసింది. యూత్ ఎక్కువగా థియేటర్లకు వెళ్లి చూస్తుండగా, కొందరు థియేటర్‌లో ఏడుస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఇదే సినిమాకు సంబంధించి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

గర్ల్‌ఫ్రెండ్ కోసం గొడవ

గ్వాలియర్‌లోని డిబి మాల్‌లో ఉన్న సినిమా హాల్ వెలుపల ‘సైయారా’ సినిమా చూసిన తర్వాత ఇద్దరు యువకులు తమ గర్ల్‌ఫ్రెండ్ కోసం గొడవ పడ్డారు. మొదట మాటలతో ప్రారంభమైన వాగ్వాదం.. క్రమంగా దాడికి దారితీసింది. ఇద్దరూ ఒకరినొకరు తన్నుకోవడం, గుద్దుకోవడం ప్రారంభించడంతో అక్కడ పెద్ద ఎత్తున జనం గుమిగూడారు.

వీడియో సోషల్ మీడియాలో వైరల్

ఈ గొడవను అక్కడే ఉన్న ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో వీడియో కాసేపట్లోనే వైరల్ అయింది. వీడియోలో ఇద్దరు యువకులు కోపంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం, పక్కవాళ్లు ఆపడానికి ప్రయత్నించినా వినకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది.

పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు లేదు

ఈ ఘటనకు సంబంధించి పడావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతంలో ఎటువంటి అధికారిక ఫిర్యాదు నమోదుకాలేదు. అయినప్పటికీ, వీడియో చూసిన నెటిజన్లు ఈ గొడవపై విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

వీడియో చూడండి…



Show Full Article
Print Article
Next Story
More Stories