No Clean Shave, No Love: మాకు గడ్డంలేని బాయ్‌ ఫ్రెండ్స్‌ కావాలంటూ అమ్మాయిల ర్యాలీ

No Clean Shave, No Love: ప్రస్తుతం యువత ఫ్యాషన్ విషయంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. ట్రెండీ లుక్స్ కోసం పరితపిస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 20 Oct 2024 7:04 AM IST
No Clean Shave, No Love Indore Girls Takes Out Rally Advocating No Beard Boyfriends
X

No Clean Shave, No Love: మాకు గడ్డంలేని బాయ్‌ ఫ్రెండ్స్‌ కావాలంటూ అమ్మాయిల ర్యాలీ

No Clean Shave, No Love: ప్రస్తుతం యువత ఫ్యాషన్ విషయంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. ట్రెండీ లుక్స్ కోసం పరితపిస్తున్నారు. మారుతున్న కాలానుగుణంగా యువతలో ఫ్యాషన్ అభిరుచులు మారుతున్నాయి. అబ్బాయిల్లో కొందరు గడ్డం పెంచి ఫ్యాషన్ గా కనిపిస్తుంటే, మరికొందరు క్లీన్ షేవ్ లో కనిపించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక అమ్మాయిల్లో కొందరు క్లీన్ షేవ్ లో ఉండే అబ్బాయిలను ఇష్టపడితే, మరికొందరు గడ్డంతో ట్రెండీగా ఉండే అబ్బాయిలను కోరుకుంటారు.

ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇండోర్ లో కొందరు కాలేజీ యువతులు అబ్బాయిల గడ్డం విషయమై ర్యాలీ తీయడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మ‌ధ్య ప్ర‌దేశ్ రాజ‌ధాని ఇండోర్‌లోని ఓ ప్ర‌ముఖ యూనివ‌ర్సిటీలో యువ‌తులు వినూత్న నిర‌స‌న చేప‌ట్టారు. త‌మ‌ను ప్రేమించే అబ్బాయిల‌కు 'గుబురు గ‌డ్డం' ఉండ‌రాద‌ని వారు కోరుతున్నారు. క్లీన్ షేవ్‌తో ఉన్న‌వారే ప్రేమించాల‌ని వారు నిర‌స‌న చేప‌ట్టారు.

మాకు గడ్డంలేని బాయ్ ఫ్రెండ్స్ కావాలంటూ యువతులు ఈ వినూత్న ర్యాలీకి శ్రీకారం చుట్టారు. 'గడ్డం తొలిగించండి.. ప్రేమను కాపాడండి' అనే నినాదంతో యువతులు ముఖాలకు గడ్డం మేకప్ తో ర్యాలీ నిర్వహించారు. ఇక వారి చేతిలో ఉన్న ప్లడ్ కార్డులపై 'నో క్లీన్ షేవ్.. నో లవ్', 'మాకు గడ్డంలేని బాయ్ ఫ్రెండ్స్ కావాలి', 'నో క్లీన్ షేవ్ .. నో గర్ల్ ఫ్రెండ్' వంటి లైన్స్ కనిపించాయి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story