Viral Video: బైకుపై వచ్చి.. వీధిలో నడుచుకుంటూ వెళుతున్న మహిళపై దారుణం..!

Meerut Man Misbehaves With Woman on Street CCTV Video Viral
x

Viral Video: బైకుపై వచ్చి.. వీధిలో నడుచుకుంటూ వెళుతున్న మహిళపై దారుణం..!

Highlights

Viral Video: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో అరాచకానికి పాల్పడ్డ ఓ కామాంధుడు… రోడ్డుపైనే మహిళను వేధించి పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Viral Video: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో అరాచకానికి పాల్పడ్డ ఓ కామాంధుడు… రోడ్డుపైనే మహిళను వేధించి పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బైక్‌పై వచ్చిన ఓ యువకుడు, ఓ మహిళను అనుచితంగా ముద్దుపెట్టుకుని అక్కడినుంచి పరారయ్యాడు. ఈ సంఘటన మే 20వ తేదీన సాయంత్రం నాలుగు గంటల సమయంలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ సాయంత్రం ఓ ఇరుకైన వీధిలో నడుచుకుంటూ వెళుతోంది. అప్పటికే ఆమెకు ఎదురుగా బైక్‌పై ఓ యువకుడు వచ్చాడు. ఆమె పక్కకు జరగడంతో, బైక్‌ను ఆ మహిళకు దగ్గరగా ఆపిన యువకుడు, అకస్మాత్తుగా ఆమెను ముద్దుపెట్టి, వెంటనే బైక్‌పై పరారయ్యాడు. ఈ ఘటనతో షాక్‌కు గురైన మహిళ, కోపంతో బూతులు తిట్టి అక్కడినుంచి వెళ్లిపోయింది.

ఈ దుర్మార్గ చర్య మొత్తం అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయింది. అనంతరం ఈ దృశ్యాలు సచిన్ గుప్త అనే వ్యక్తి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా, వీడియో కాస్తా వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆ కామాంధుడిపై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. వెంటనే పోలీసులు అతడిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

వైరల్ వీడియో ప్రస్తుతం పోలీసుల దృష్టికి చేరింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, బాధిత మహిళను సంప్రదించి, సీసీటీవీ ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories