Viral Video: అత్తను పెళ్లి చేసుకున్న యువకుడు.. బలవంతంగా తిలకం దిద్ది

Viral Video: అత్తను పెళ్లి చేసుకున్న యువకుడు.. బలవంతంగా తిలకం దిద్ది
x

Viral Video: అత్తను పెళ్లి చేసుకున్న యువకుడు.. బలవంతంగా తిలకం దిద్ది

Highlights

బీహార్‌లో ఓ భయానక ఘటన చోటు చేసుకుంది. భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ ఓ యువకుడిని కుటుంబసభ్యులే చితకబాదారు.

బీహార్‌లో ఓ భయానక ఘటన చోటు చేసుకుంది. భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ ఓ యువకుడిని కుటుంబసభ్యులే చితకబాదారు. అంతటితో ఆగకుండా, అతనికి ఆమెతో బలవంతంగా పెళ్లి కూడా జరిపించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ సంఘటన బీహార్‌ రాష్ట్రంలోని సుపౌల్‌ జిల్లాలోని భీంపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జీవ్‌ఛాపూర్ గ్రామంలో జులై 2న జరిగింది. మిథిలేష్‌ కుమార్ అనే 24 ఏళ్ల యువకుడిని కొందరు వ్యక్తులు అతని ఇంట్లో నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. అతని మామ శివ్‌చంద్ర ఆయన్ని తన ఇంటికి తీసుకెళ్లి గ్రామస్థాయిలో పంచాయితీ ఏర్పాటు చేశాడు.

శివ్‌చంద్ర భార్య రీటా దేవితో మిథిలేష్‌కు వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ జనసమూహంతో కలిసి అతనిపై దాడి చేశాడు. కర్రలు, రాడ్లతో చితకబాది తీవ్రంగా గాయపరిచారు. రీటా దేవిని కూడా కొట్టారు. ఆ తర్వాత బలవంతంగా మిథిలేష్‌ చేత రీటా నుదిటిపై సిందూరం పెట్టించి, పెళ్లి జరిగిందని ప్రకటించారు.

ఈ దారుణ ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మిథిలేష్‌ తండ్రి రామచంద్ర, తల్లి కూడా కొట్టబడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసుల రాకతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన మిథిలేష్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories