Viral News: ఆవు చనిపోవడంపై కోపంతో పులులకు విషాహారం!

Viral News: ఆవు చనిపోవడంపై కోపంతో పులులకు విషాహారం!
x

Viral News: ఆవు చనిపోవడంపై కోపంతో పులులకు విషాహారం!

Highlights

తమిళనాడు-కేరళ సరిహద్దుకు సమీపంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని మలెమహదేశ్వర వన్యధామంలో జరిగిన పులుల మృతిపై తీవ్ర కలకలం రేగింది.

Viral News: తమిళనాడు-కేరళ సరిహద్దుకు సమీపంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని మలెమహదేశ్వర వన్యధామంలో జరిగిన పులుల మృతిపై తీవ్ర కలకలం రేగింది. ఇటీవల ఐదు పులులు అనుమానాస్పదంగా మృతి చెందడంతో అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో పులులకు విషాహారం పెట్టినట్టు బయటపడింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన మాదురాజుతో పాటు అతనికి సహకరించిన కోనప్ప, నాగరాజులను పోలీసులు అరెస్టు చేశారు.

అధికారుల వివరాల ప్రకారం, మాదురాజు పెంచుకుంటున్న ‘కెంచి’ అనే ఆవును అడవిలో ఓ పులి వేటాడి చంపడంతో అతడు తీవ్రంగా మానసికంగా బాధపడ్డాడు. పులులపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుని, మృత ఆవు శరీరంపై విషం పాతి అడవి అంచున వదిలాడు. ఆ విషమున్న కళేబరాన్ని తిన్న తల్లి పులితో పాటు నాలుగు పులి కూనలు ప్రాణాలు కోల్పోయాయని అటవీశాఖ తెలిపింది.

ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్న అధికారులు, వారి నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు మీణ్యం ప్రాంతంలోని ‘అరణ్య భవన్’కు తరలించారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అటవీశాఖ మంత్రి ఈశ్వర ఖండ్రేకు ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. నివేదిక వచ్చాక నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories