ఆకే కదా అని తీసిపారేయకండి!

ఆకే కదా అని తీసిపారేయకండి!
x
Highlights

ఇల్లు.. హోటల్ .. ఎక్కడైనా సరే కరివేపాకు లేకుండా కూరలు ఉండవు. కచ్చితంగా ప్రతీ కూరలోనూ, ఉప్మా వంటి అల్పాహారాల్లోనూ.. కరివేపాకును వాడుతారు. కరివేపాకు...

ఇల్లు.. హోటల్ .. ఎక్కడైనా సరే కరివేపాకు లేకుండా కూరలు ఉండవు. కచ్చితంగా ప్రతీ కూరలోనూ, ఉప్మా వంటి అల్పాహారాల్లోనూ.. కరివేపాకును వాడుతారు. కరివేపాకు వేయకపోతే వంటకం రుచి పెరగదని చెబుతారు. అయితే, తినేసమయంలో మాత్రం అబ్బా కరివేపాకు అంటూ పక్కకు తీసి పారేస్తాం. చివరికి వంట చేసిన వారు కూడా కరివేపాకును ఏరి అవతల పారేయడం సహజంగా జరిగిపోతుంది. ఇది తప్పంటున్నారు వైద్యులు. కరివేపాకులో ఉన్న ఔషధగుణాలు లెక్కలేనన్ని అని చెబుతున్నారు. అసలు కరివేపాకుతో మన ఆరోగ్యానికి కలిగే లాభం విన్నారంటే మీరూ ఇక కరివేపాకును ఎట్టిపరిస్థితిలోనూ తీసిపారేయరు.

పోషకాల సమాహారం

కార్బోహైడ్రేట్స్, ఫైబర్, కాల్షియం, ఫాస్పరస్, ఇనుము, మెగ్నీషియం, రాగి తో పటు ఖనిజాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ సి,ఎ,బి,ఈ లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్, ప్లాస్టీ స్టెరాల్స్, అమైనో ఆమ్లాలు, గ్లైకోసైడ్లు మరియు ఫ్లేవానాయిడ్స్ వంటి అనేక పోషకాలు మెండుగా ఉంటాయి.

కడుపులో కలవరం ఉండదు..

జీర్ణాశయసమస్యలను నియంత్రించడంతో పాటు... విరేచనాలను తగ్గించడంలో కరివేపాకును మించింది లేదు. అజీర్తిని అరికట్టడం తో పాటు పొట్ట కండరాలను బలోపేతం చేస్తుంది. కరివేపాకులో కొన్ని లాక్సేటివ్ లక్షణాలుం మలబద్దకాన్ని నివారిస్తాయి. శరీరంలోని అనారోగ్యకరమైన కొవ్వునుతగ్గించడమే కాకుండా డ యేరియాను నయం చేస్తుంది. ఫుడ్ పాయిజనింగ్‌ నుంచి ఉపశమనాన్నిస్తుంది.

ఎన్నోరకాలుగా..

న్యుమోనియా, ఫ్లూ వంటి అనారోగ్య పరిస్థితుల్లో కరివేపాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మధుమేహం, రక్తపోటు వంటి రుగ్మతలను తగ్గిస్తుంది. క్యాన్సర్ ప్రేరేపితం కారకాలను నియంత్రించి క్యాన్సర్ రాకుండా రక్షిస్తుంది. కరివేపాకులో ఉండే కార్బోజోల్ ఆల్కలాయిడ్ అనే పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ వల్ల, శరీరంలో ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది. శరీరం ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కు గురికాకుండా బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. శరీరానికి మంచి రంగును కాంతిని అందిస్తుంది.ఖర్చులేని దివ్యౌషధం

ఐదో పదో పెట్టి మార్కెట్లో కరివేపాకును కొని తెచ్చుకోవడం మనం చేసే పని. అయితే, కరివేపాకు సులువుగా పెరిగే మొక్క దీనిని కుండీలోనూ, ఇంటి పెరట్లోనూ చక్కగా పెంచుకోవచ్చు. కొద్దిగా ఓపికగా పెంచుకుంటే.. ఇంటికి కావలసిన ఔషధాన్ని తాజాగా మనకి అందిస్తుంది కరివేపాకు. అందుకే నాకే కదా అని పక్కన పడేయకండి.

Show Full Article
Print Article
Next Story
More Stories