Huawei: త్వ‌ర‌లో.. హువావే నూతన ఆపరేటింగ్ సిస్టం...?

Huawei: త్వ‌ర‌లో.. హువావే నూతన ఆపరేటింగ్ సిస్టం...?
x

Huawei to shift phones to its own Harmony operating system from 2021

Highlights

Huawei: గూగుల్ ఆండ్రాయిడ్‌ను ఉపయోగించకుండా చైనా టెలికం దిగ్గజం హువావేను అమెరికా నిషేధించిన తర్వాత ప్రత్యామ్నాయ యాప్ ఎకోసిస్టం నిర్మాణంపై హువావే దృష్టిసారించింది.

Huawei: చైనా టెలికం దిగ్గజం హువావేను గూగుల్ ఆండ్రాయిడ్‌ను ఉపయోగించకుండా అమెరికా నిషేదించిన విషయం తెలిసిందే.దీంతో ప్రత్యామ్నాయ యాప్ ఎకోసిస్టం నిర్మాణంపై హువావే దృష్టిసారించింది. ఇందులో భాగంగా హార్మోనీఓఎస్‌ను ప్రకటించింది. చైనాలో దీనిని "హాంగ్‌మెంగ్ఓఎస్‌"గా పిలుస్తారు. హువావే, హానర్ ఫోన్‌లలో ఆండ్రాయిడ్ స్థానంలో దీనిని అభివృద్ధి చేస్తున్నారు. ఈ ఓఎస్ అధికారిక విడుదల త్వరలో జరగనుంది. స్మార్ట్ ఫోన్లలో వచ్చే ఏడాది నుంచి తమ నూతన స్వదేశీ ఆపరేటింగ్ సిస్టం అందుబాటులోకి వస్తుందని హువావే తాజాగా వెల్లడించింది.

హార్మోనీ ఓఎస్‌ను ఇప్పటి వరకు స్మార్ట్ టీవీలు, ఇన్-కార్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టంలు, వేరబుల్ డివైజ్‌లలో ఉపయోగిస్తూ వస్తున్నారు. కంపెనీ స్మార్ట్‌ఫోన్లలో దీనిని ఇప్పటి వరకు ఉపయోగించలేదని హువావే కన్స్యూమర్ ప్రోడక్ట్స్ డివిజన్ సీఈవో యు చెంగ్‌డాంగ్ తెలిపారు. శాంసంగ్ ‌తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తిదారుగా హువావే రికార్డులకెక్కింది. అయితే, ఈ ఏడాది రెండో త్రైమాసికంలో శాంసంగ్‌ను హువావే వెనక్కి నెట్టేసిందని మార్కెట్ అనాలిసిస్ సంస్థ కేనలిస్ పేర్కొంది. హార్మోనిఓఎస్ 2.0 ఎస్డీకే బీటా వర్షన్‌ను డిసెంబర్ 2020లో విడుదల చేయాలని హువావే యోచిస్తున్నది. హార్మోనీఓఎస్ ఆపరేటింగ్ ఫస్ట్ ఫోన్లు 2021లో లాంచ్ చేయనున్నారు.

వివిధ కారణాలతో గూగుల్ నుంచి అన్ని సాఫ్టువేర్ల నిషేధాన్ని ఎదుర్కొంటోంది హువావే. గూగుల్ అన్ని సాఫ్టువేర్‌లకు ప్రత్యామ్నాయంగా హార్మోనిఓఎస్ భర్తీ చేయగలదని కంపెనీ సీఈవో వెల్లడించారు. ఇవి కేవలం స్మార్ట్ ఫోన్లకు మాత్రమే పరిమితం కాదని తెలిపారు. భవిష్యత్తులో హువావే ట్యాబ్స్, పీసీలకు కూడా ఈ సాఫ్టువేర్ అందుబాటులో ఉంటుందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories