Former Miss Colombia Dances Again: ఆత్మవిశ్వాసం ఆమె సొంతం..కాలు తొలగించిన కొద్దిరోజులకే నృత్యం!

Former Miss Colombia Dances Again: ఆత్మవిశ్వాసానికి ప్రతీక ఆమె. కష్టాన్ని చిరునవ్వుతో జయించడం అంటే ఇదే. ఒక్కసారిగా శరీరంలో ముఖ్యమైన అవయవం కోల్పోయినా.. ఎక్కడా నిరాశ ధోరణిలోకి ఆమె వెళ్ళలేదు. అందుకే ఆమెకు ఇప్పుడు నెటిజనం నీరాజనం పడుతోంది.

K V D Varma
Published on: 8 July 2020 6:17 PM IST
Former Miss Colombia Dances Again: ఆత్మవిశ్వాసం ఆమె సొంతం..కాలు తొలగించిన కొద్దిరోజులకే నృత్యం!
X
Farmer Miss Colambia Daniella Alvarez dance (image from Daniella Alvarez instagram)

ఆత్మవిశ్వాసానికి ప్రతీక ఆమె. కష్టాన్ని చిరునవ్వుతో జయించడం అంటే ఇదే. ఒక్కసారిగా శరీరంలో ముఖ్యమైన అవయవం(Former Miss Colombia Dances again) కోల్పోయినా.. ఎక్కడా నిరాశ ధోరణిలోకి ఆమె వెళ్ళలేదు. పైగా, కష్టం నుంచి అతి త్వరగా కోలుకుని మళ్ళీ తనకు అత్యంత ఇష్టమైన వ్యాపకాన్ని మరింత ఉత్సాహంతో ప్రారంభించింది. అందుకే ఆమెకు ఇప్పుడు నెటిజనం నీరాజనం పడుతోంది. ఆమె పేరు డానియల్లా అల్వరేజ్. మాజీ మిస్ కొలంబియా!

మిస్ యూనివర్స్ పోటీలకు 2012లో కొలంబియా తరఫున పోటీ పడిన ఈ అందాల బొమ్మకు అనుకోని కష్టం వచ్చిపడింది. చిన్న వయసులోనే ఆమెకు ఇస్కిమియా (ischemia) అనే వ్యాధి వచ్చింది. ఈ వ్యాధి వచ్చిన వారికి శరీరంలోని ఎదో ఒక అవయవానికి రక్తాన్ని సరఫరా చేసే నాళాలు పనిచేయకుండా పోతాయి. దీంతో ఆ అవయం చచ్చుపడిపోతుంది.

అల్వరేజ్ కు తన 32వ ఏట కడుపులో కణితిని తొలగించే ఒక సర్జరీ చేశారు డాక్టర్లు. ఆ సమయంలో వచ్చిన ఇబ్బందులతో ఆమె ఇస్కిమియాకు గురైంది. దీంతో ఆమె ఎడమ కాలు కొంత భాగాన్ని పూర్తిగా తొలగించాల్సి వచ్చింది. తరువాత ఆమె కుడి కాలు లో కూడా కొంత భాగం పనిచేయకుండా పోయింది. దీంతో ఆమె తనకు రెండుకాళ్ళూ ఇక పనిచేయవేమో అని అనుకుంది. అయితే, ఆమె తన ఆత్మవిశ్వాశాన్ని మాత్రం కోల్పోలేదు. సర్జరీ చేయించుకున్న రెండు వారాల్లోనే వైద్యులనే ఆశ్చర్య పరుస్తూ ఆమె కోలుకుంది. తనకు ఇష్టమైన తనకు అభిమానులను ఇచ్చిన డ్యాన్స్ చేయడం మొదలు పెట్టింది.

ఈ మేరకు ఆమె ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ చేసింది. దానిని షేర్ చేస్తూ డైలీ మెయిల్ వెబ్ పత్రిక ఒక కథనం రాసింది. ఆమె ఆ వీడియోలో తన సోదరునితో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించింది. చాలా ఉత్సాహంగా కనిపించిన ఆమెను చూసి ఆమె అభిమానులు సంతోషంతో ఆమెకు సపోర్ట్ గా కామెంట్లు పెడుతున్నారు. ఆమె పోస్ట్ ఇప్పుడు టాప్ ట్రేండింగ్ లో ఉంది.

తనకు అత్యంత ఇష్టమైన నృత్యం చేయడానికి అవసరమైన మ్కుఖ్య అవయవం పూర్తిగా కోల్పోయినా.. కేవలం రెండు వారాల్లోనే మళ్ళీ నృత్యం చేసేందుకు సిద్ధం అయిపోవడంతో ఆమె ఆత్మవిశ్వాసానికి, జీవితం పట్ల ఆమెకున్న నమ్మకానికి అందరూ ఫిదా అయిపోతున్నారు. ఆమె సోదరుడు రిక్కీ అల్వరేజ్ తో కలసి ఆమె చేసిన నృత్యం అదిరింది. ఈ సందర్భంగా ఆమె ''నా అభిమాన నృత్య భాగస్వామి రిక్కీ అల్వరేజ్ తో జీవితాన్ని గడపడం సంతోషంగా ఉంది. కష్టాల పట్టింపు లేదు. మనం జీవితంలో స్థిత ప్రజ్ఞులమై ఉండాలి'' అంటూ ఆమె రాశారు. అది ఆమె ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తోంది.


K V D Varma

K V D Varma

Next Story