కళాకారుడి అద్భుత ప్రతిభ.. కాళ్లతో బొమ్మల తయారి

కళాకారుడి అద్భుత ప్రతిభ.. కాళ్లతో బొమ్మల తయారి
x
Highlights

కళకు హద్దుల్లేవు. కళాకారుడికి ఆటంకాల్లేవు. ఏదైనా సాధించాలన్న సంకల్పముంటే, ఏదీ అసాధ్యం కాదు. ఇదే స్ఫూర్తితో బ్రెజిల్‌లో ఓ ఆర్టిస్ట్, అందర్నీ...

కళకు హద్దుల్లేవు. కళాకారుడికి ఆటంకాల్లేవు. ఏదైనా సాధించాలన్న సంకల్పముంటే, ఏదీ అసాధ్యం కాదు. ఇదే స్ఫూర్తితో బ్రెజిల్‌లో ఓ ఆర్టిస్ట్, అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తనదైన టాలెంట్‌తో మరెందరికో ఇన్‌స్పిరేషన్‌ అయ్యాడు. చేతుల్లేవు. కాళ్లున్నాయి. వాటినే అస్త్రాలుగా మలచుకున్నాడు. తాను భిన్నం కాదు, భిన్నమైన పనులు చేస్తూ అందరిలోనూ ఆలోచన రేకెత్తిస్తున్నాడు. రకారకాల కారు బొమ్మలు, ట్రక్కు టాయ్స్. చకచకా చేసేస్తాడు. పిల్లలకు నచ్చినరీతిలో వాటిని చెక్కుతాడు.

ఇతని పేరు గెరాల్డో పెరీరా. దేశం బ్రెజిల్. జన్యుపరమైన సమస్యలతో చేతుల్లేకుండా పుట్టాడు. కానీ ఏనాడూ కుంగిపోలేదు. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా జీవితంలో అనేక సమస్యలతో పోరాటం చేస్తున్నాడు. గెరాల్డో పెరీరా మంచి ఆర్టిస్టు. బొమ్మలు గీయడంలోనే కాదు, బొమ్మలను చేయడంలోనూ దిట్ట. తన ప్రవృత్తినే వృత్తిగా మలచుకుని, జీవనోపాది పొందుతున్నాడు. పదిమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. చేతుల్లేకుండా పుట్టినా, తన తల్లిదండ్రులు ఎప్పుడూ భిన్నంగా చూడలేదని, బాధపడలేదని అంటాడు పెరీరా. అందరిలాగే తనను పెంచారని చెబుతున్నాడు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories