Viral News: అదృష్టం అంటే ఇది భ‌య్యా.. రూ. ల‌క్ష ఏకంగా రూ. 80 కోట్లు అయ్యాయి..!

Forgotten JSW Steel Shares Worth 80 Crores Viral Story
x

Viral News: అదృష్టం అంటే ఇది భ‌య్యా.. రూ. ల‌క్ష ఏకంగా రూ. 80 కోట్లు అయ్యాయి..!

Highlights

JSW Shares: అదృష్టం ఎప్పుడు, ఏ రూపంలో తలుపు తడుతుందో చెప్పలేమన్నదానికి ఈ సంఘటన బలం చేకూర్చుతుంది. 1990లో ఓ వ్యక్తి రూ.1 లక్షతో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ కంపెనీలో షేర్లు కొనుగోలు చేశాడు.

JSW Shares: అదృష్టం ఎప్పుడు, ఏ రూపంలో తలుపు తడుతుందో చెప్పలేమన్నదానికి ఈ సంఘటన బలం చేకూర్చుతుంది. 1990లో ఓ వ్యక్తి రూ.1 లక్షతో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ కంపెనీలో షేర్లు కొనుగోలు చేశాడు. కాలక్రమంలో ఆ పత్రాలను ఎక్కడో మూలన పెట్టేసి మరచిపోయాడు.

అయితే ఇటీవల ఆయన కుమారుడు ఇంటిలో శుభ్రం చేస్తుండగా ఆ పాత షేర్ సర్టిఫికెట్లను గుర్తించాడు. ఆసక్తితో ఆరా తీస్తే… షేర్‌ల విలువ ఊహించని స్థాయికి చేరినట్లు తెలుస్తుంది. రూ.10 లక్షలు, రూ.20 లక్షలు కాదు… ఏకంగా రూ.80 కోట్లు అయ్యిందట!

ఈ సమాచారం సౌరవ్ దత్తా అనే వ్యక్తి ద్వారా ఎక్స్ (మాజీ ట్విట్టర్) లో షేర్ చేయడంతో… ఈ కథనం నెట్టింట వైరల్‌గా మారింది. దీర్ఘకాల పెట్టుబడులు ఎలా విలువ పెంచుతాయో చెప్పడానికి ఇదే ఉత్తమ ఉదాహరణ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇక దీన్ని బట్టి… ‘స్మాల్ ఇన్వెస్ట్‌మెంట్స్, లాంగ్‌టెర్మ్ పేషెన్స్’ ఎంత గొప్ప ఫలితాలిస్తాయో మరోసారి రుజువైంది.


Show Full Article
Print Article
Next Story
More Stories