పార్కింగ్‌లో అనుమానాస్పదంగా ఉన్న కారు.. డోర్ తీసి చూస్తే ఫ్యూజులు ఔట్..!

పార్కింగ్‌లో అనుమానాస్పదంగా ఉన్న కారు.. డోర్ తీసి చూస్తే ఫ్యూజులు ఔట్..!
x

పార్కింగ్‌లో అనుమానాస్పదంగా ఉన్న కారు.. డోర్ తీసి చూస్తే ఫ్యూజులు ఔట్..!

Highlights

గుజరాత్ రాష్ట్రంలోని పావగఢ్ పర్వత ప్రాంతంలో ఒక పార్కింగ్ ప్లేస్‌కి రెండు రోజులుగా ఆగివున్న ఇన్నోవా కారు స్థానికుల కంట పడింది.

గుజరాత్ రాష్ట్రంలోని పావగఢ్ పర్వత ప్రాంతంలో ఒక పార్కింగ్ ప్లేస్‌కి రెండు రోజులుగా ఆగివున్న ఇన్నోవా కారు స్థానికుల కంట పడింది. కారు AC ఆన్‌లో ఉండటం, ఎటువంటి కదలికలే లేకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కారును ఓపెన్ చేయగానే వెనుక సీటులో యువకుడు, యువతి మృతదేహాలు కనబడినాయి. ఈ దృశ్యం చూసి వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

పరిశీలించగా, ఆ కారు అహ్మదాబాద్ ఈస్ట్ (GJ 27 సిరీస్)కి చెందినదిగా గుర్తించారు. కారు గత రెండు రోజులుగా పావగఢ్ బస్టాండ్ సమీపంలో పార్క్ చేయబడి ఉంది. మరుసటి రోజు కూడా అదే విధంగా ఉండటం వల్ల స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని టెక్నీషియన్ సహాయంతో కారు తలుపులు ఓపెన్ చేశారు. అప్పటికే యువకుడు, యువతి మృతిచెందినట్టుగా కనపడింది. మృతదేహాలను హలోల్ రిఫరల్ ఆసుపత్రికి పోస్ట్‌మార్టం కోసం తరలించారు.

మృతుల వివరాలు:

పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం మృతులు హిమ్మత్‌నగర్‌లోని అకోద్ర గ్రామానికి చెందిన ఆజాద్ మహేష్ సింగ్ మరియు శ్రేయ ప్రజాపతి అని గుర్తించారు. కారు నంబర్ ఆధారంగా వారి వివరాలు కనుగొన్నారు.

ఆత్మహత్యా..? ప్రమాదవశాత్తూ మరణమా..?

వారు ఎక్కువసేపు కారులో ఉండడం, కిటికీలు మూసివుండడం, AC ఆన్‌లో ఉండడం వల్ల శ్వాస ఆడకపోయి చనిపోయారా? లేక మద్యం, డ్రగ్స్‌ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసును ప్రస్తుతం ప్రమాదవశాత్తు మరణంగా నమోదు చేశారు.

ఈ విషాదకర సంఘటనపై పూర్తి సమాచారం కోసం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories