Viral Video: రోడ్డుపై బిచ్చ‌గాడిలా ఉన్న ఈ వ్య‌క్తి ఓ స్టార్ హీరో.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

Aamir Khan Spotted in Stone Age Look on Mumbai Streets Video Goes Viral
x

Viral Video: రోడ్డుపై బిచ్చ‌గాడిలా ఉన్న ఈ వ్య‌క్తి ఓ స్టార్ హీరో.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

Highlights

Viral Video: సినిమా తారలు, క్రీడాకారులు మారువేషాలలో బయటకు రావడం కొన్నిసార్లు ఆసక్తికర వీడియోలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

Viral Video: సినిమా తారలు, క్రీడాకారులు మారువేషాలలో బయటకు రావడం కొన్నిసార్లు ఆసక్తికర వీడియోలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఓ బాలీవుడ్ స్టార్ హీరో బిడ్డ‌గాడి వేష‌దార‌ణ‌లో హ‌ల్చ‌ల్ చేశారు. ఇంత‌కీ ఏవ‌రా హీరో.? ఆ క‌థేంటో ఇప్పుడుచూద్దాం.

ఓ వ్యక్తి రాతి యుగంలో నివసించే మనిషిలా కనిపిస్తున్నాడు. అతనికి పొడవాటి గడ్డం, జుట్టు, శరీరంపై జంతువుల చర్మంతో తయారు చేసిన దుస్తులు, కాలులకు బూట్లు – ఇలా పూర్తిగా ఆదిమానవుడిని తలపించే లుక్. ఈ గెటప్‌లో అతను ఒక చిన్న హ్యాండ్‌కార్ట్‌ను లాగుతూ ముంబై వీధుల్లో సంచరిస్తూ, చిన్న చిన్న షాపుల్లోకి వెళ్లి తినేందుకు ఏదైనా ఇవ్వమంటూ అడుగుతున్నాడు. స్థానికులు తొలుత అతడిని మాన‌సిక‌ లోపాలు ఉన్న బిచ్చగాడేనా అనుకున్నారు. కొంతమంది భయంతో అక్కడి నుంచి పారిపోయారు.

అయితే ఆ గెటప్‌లో ఉన్న వ్యక్తి ఎవరో కాదు – బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్. మొదట ఈ వ్యక్తి ఎవరో తెలియక వైరల్‌గా మారిన వీడియో, తరువాత అమీర్ ఖాన్ మేకప్ వేస్తున్న క్లిప్స్ వెలుగులోకి రావడంతో అసలు విషయం బయటపడింది.

ఎందుకీ వేషధారణ?

ఇది ఏ సినిమా కోసమో, ప్రకటన కోసమో, లేక ఇంకేదైనా ప్రయోగాత్మక ప్రాజెక్ట్ కోసమో అన్న విషయమై ఇంకా స్పష్టత లేదు. కొంతమంది ఇది ఓ యాడ్ షూటింగ్ కావచ్చునని అంటుంటే, మరికొందరు కొత్త సినిమాకై ప్రిపరేషన్ అనీ ఊహిస్తున్నారు. అధికారికంగా మాత్రం ఎటువంటి సమాచారం బయటకు రాలేదు.

అమీర్ గ‌తంలో కూడా ఇలాంటి ఒక స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. మారువేషంలో అమీర్ ఖాన్ మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఇంటికి వెళ్లిన సంఘటన అప్ప‌ట్లో వైర‌ల్ అయ్యింది.


Show Full Article
Print Article
Next Story
More Stories