పెంచుకున్న గుర్రాన్ని వండుకు తినడమే కాకుండా.. దాన్ని ప్రచారం కూడా చేసింది.. ఇప్పుడు చీవాట్లు తింటోంది!

పెంచుకున్న గుర్రాన్ని వండుకు తినడమే కాకుండా.. దాన్ని ప్రచారం కూడా చేసింది.. ఇప్పుడు చీవాట్లు తింటోంది!
x
Highlights

సాధారణంగా పెంపుడు జంతువులంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది. వాటితో ఎక్కువ అనుబంధం ఏర్పడిపోతుంది. కోడైనా.. కుక్కైనా.. ఏదైనా సరే వాటిని మనతో పాటు పెంచుకుంటే...



సాధారణంగా పెంపుడు జంతువులంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది. వాటితో ఎక్కువ అనుబంధం ఏర్పడిపోతుంది. కోడైనా.. కుక్కైనా.. ఏదైనా సరే వాటిని మనతో పాటు పెంచుకుంటే అవి మన జీవితంలో భాగం అయిపోతాయి. వాటికి ఏదైనా అయితే మన మన్సూ విలవిలలాడుతోంది క్షణమైనా సరే. ఇక ఆ జంతువూ చనిపోతే ఆ బాధను తట్టుకోలేరు. కానీ, ఓ కుటుంబం తమతో పాటు పెంచుకున్న గుర్రం చనిపోతే దానిని ముక్కలు గా కోసి ఆ మాంసాన్ని ఫ్రిజ్ లో పెట్టుకుని దానిని వంట చేసుకుని తిన్నారు. తింటే తిన్నారు అని వదిలేయకుండా.. ఆ విషయాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి గొప్పగా చెప్పుకున్నారు. నెటిజన్లు అక్షింతలు వేయడంతో ఆ పేజీని తొలగించారు.. కానీ ఆ పేజీ స్క్రీన్ షాట్ లు ఇప్పుడు వైరల్ గా మారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వారు చేసిన ఆ ఆపనికి జంతు ప్రేమికులు చీవాట్లు పెడుతూ ట్వీట్లు, కామెంట్లూ చేస్తున్నారు.

ఈ సంఘటన నార్వే దేశంలో చోటు చేసుకుంది. ఆదేశానికి చెందిన పియా ఓల్డెన్ కు గుర్రపుస్వారీ అంటే ఇష్టం. దీంతో ఆమె తల్లి దండ్రులు ఆమె కోసం ఓ చక్కని గుర్రాన్ని కొనిచ్చారు. ఈగుర్రం మీదే అఆమే స్వారీ నేర్చుకుంది. అయితే ఆ గుర్రం 2018 లో అనారోగ్యం పాలవడంతో తన పరుగు ఆపేసింది. ఇటీవల ఆ గుర్రం మరణించింది. ఆ గుర్రానికి పియా తల్లిదండ్రులు అంత్యక్రియలు చేయకుండా..కోసి మాంసం ఫ్రిజ్ లో పెట్టి కూర వండి పెట్టారు. ఆ కూర తిని పియా ఆ కూరకు సంబంధించిన ఫోటోలు.. తన గుర్రం ఫోటో పక్క పక్కన పెట్టి ఫసె బుక్ లో షేర్ చేసింది. పైగా ఆ మాంసం కూర చాలా టేస్టీ గా ఉందంటూ కామెంట్లూ పెట్టింది.

ఆమె చేసిన ఈ పనికి ఫేస్ బుక్ లో అందరూ చీవాట్లు పెట్టారు. అంత దుర్మార్గం ఏమిటంటూ విరుచుకుపడ్డారు. జంతు ప్రేమికులైతే ఆమెను శాపనార్థాలు పెట్టారు. దీంతో ఆమె తన ఫేస్ బుక్ పోస్ట్ తొలగించింది. కానీ అప్పటికే ఆలస్యం అయిపొయింది. ఈ విషయం ఆమె ఫేస్ బుక్ పోస్ట్ స్క్రీన్ షాట్స్ తో ప్రపంచమంతా చక్కర్లు కొడుతోంది. దాంతో ప్రపంచవ్యాప్తంగా పియా ఓల్డెన్ ను విమర్శిస్తూ విపరీతంగా పోస్ట్ లు పెడుతున్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories