Viral Video: వేటాడిన జింక‌ను ప‌ట్టుకొని చెట్టెక్కిన చిరుత‌.. ఇంత‌లో సీన్ రివ‌ర్స్‌..

A Carved Leopard Holding a Hunted Deer Viral Video
x

యూట్యూబ్ ఫానీ వీడియో (యూట్యూబ్ ఇమేజ్)

Highlights

Viral Video: సోష‌ల్ మీడియాలో జంతువుల‌కు సంబంధించిన వీడియోలు త‌ర‌చూ వైర‌ల్ అవుతుంటాయి. నెటిజ‌న్లు ఈ వీడియోల‌ను ఆస‌క్తిగా తిల‌కిస్తారు.

Viral Video: సోష‌ల్ మీడియాలో జంతువుల‌కు సంబంధించిన వీడియోలు త‌ర‌చూ వైర‌ల్ అవుతుంటాయి. నెటిజ‌న్లు ఈ వీడియోల‌ను ఆస‌క్తిగా తిల‌కిస్తారు. తాజాగా చిరుత‌పులి వేట‌కి సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది. చిరుత వేట ఎలా ఉంటుందో అంద‌రికి తెలిసిందే. రెప్పాపాటులో దాడి చేస్తుంది. దాని ముందు ఎంత‌టి జంతువైనా దిగ‌దుడుపే. తాజా వీడియోలో చిరుత‌పులి జింక‌ను వేటాడి దానిని ప‌ట్టుకొని చెట్టుపై ఎక్కుతుంది. అక్క‌డికి వెళ్లిన త‌ర్వాత అనుకోని సంఘ‌ట‌న జరుగుతుంది.. ప్ర‌స్తుతం ఈ ఫ‌న్నీ వీడియోను నెటిజ‌న్లు ఎక్కువ‌గా చూస్తున్నారు.

వీడియోలో ఒక చిరుతపులి వేటాడిన జింక మృతదేహాన్ని పట్టుకుని చెట్టు ఎక్క‌డం మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. అది బ‌రువైన జింక‌ను ప‌ట్టుకొని సులువుగా చెట్టు ఎక్క‌డం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. అలాగే దాని వెనుక ఇంకో చిరుత కూడా చెట్టు ఎక్కుతుంది. అయితే మొద‌టి చిరుత జింక క‌ళేబ‌రాన్ని కొమ్మ‌పై పెట్టి తింటుండ‌గా అది జారి కింద ఉన్న మ‌రో చిరుత‌పై ప‌డుతుంది. అప్పుడు ఆ చిరుత హ‌ఠాత్తుగా లేచి ఎగురుతుంది. ఈ స‌న్నివేశం చూసిన నెటిజ‌న్లు న‌వ్వుఆపుకోలేక‌పోతున్నారు. వీడియో ఫ‌న్నీగా ఉంద‌ని కామెంట్ చేస్తున్నారు.

అయితే వీడియో చూసిన కొంత‌మంది నెటిజ‌న్లు జింక ఈ విధంగానైనా చిరుత‌పై ప‌గ తీర్చుకుంద‌ని కామెంట్ చేస్తున్నారు. ఒక వినియోగదారుపై వ్యాఖ్యానిస్తూ 'అద్భుతమైన ఫుటేజ్ కానీ జింక కళేబరం చిరుతపులి మీద పడటం నాకు చాలా ఫన్నీగా అనిపించిందన్నాడు. అదే సమయంలో మరొక వినియోగదారు వ్యాఖ్యానిస్తూ 'వీడియో చూసిన తర్వాత, జింక చనిపోయిన తర్వాత కూడా చిరుతపులితో పోరాడుతున్నట్లు అనిపిస్తుంది' అని రాశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వీడియోను యాభై వేల మందికి పైగా వీక్షించారు. లైక్స్‌, కామెంట్స్‌, షేర్స్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories