ప్రో కబడ్డీలో ఈరోజు..

K V D Varma
Published on: 21 July 2019 3:55 PM IST
ప్రో కబడ్డీలో ఈరోజు..
X

ఉత్సాహంగా ప్రో కబడ్డీ పోటీలు మొదలయ్యాయి. హైదరాబాద్ గచ్చిబౌలి వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో నిన్న తొలిరోజు పోటీలు ఉద్విగ్నంగా సాగాయి. తెలుగు టైటాన్స్, యుముంబా జట్ల మధ్య జరిగిన తొలిపోరులో 5 పాయింట్లతో యుముంబా విజయం సాధించగా, రెండో పోరులో బెంగళూరు బుల్స్ రెండు పాయింట్లతో పాట్నా పైరేట్స్ పై విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఇక ఈరోజు బెంగళూరు బుల్స్ జట్టు గుజరాత్ ఫార్ట్యున్ జెయింట్స్ తో సాయంత్రం 7.30 గంటలకు జరిగే మూడో మ్యాచ్ లో తలబడుతుంది. అదేవిధంగా తెలుగు టైటాన్స్ జట్టు తమిళ తలైవా జట్టుతో రాత్రి 8.30 గంటలకు జరిగే నాలుగో మ్యాచ్ లో తలబడుతుంది. ఈరోజైనా తెలుగు టైటాన్స్ గెలవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

K V D Varma

K V D Varma

Next Story