తెలుగు టైటాన్స్ రెండో 'సారీ'

K V D Varma
Published on: 21 July 2019 9:36 PM IST
తెలుగు టైటాన్స్ రెండో సారీ
X

తన రెండో మ్యాచ్ లోనూ ఘోర పరాజయం పాలైంది తెలుగు టైటాన్స్ జట్టు. ప్రో కబడ్డీ సీజన్ 7 లో భాగంగా ఈరోజు జరిగిన రెండో మ్యాచ్ (మొత్తమ్మీద నాలుగోది) లో తెలుగు టైటాన్స్ జట్టు తమిళ తలైవాస్ చేతిలో చిత్తయింది. తమిళ తలైవాస్ 39 పాయింట్లు సాధించగా.. తెలుగు టైటాన్స్ 26 పాయింట్లతో సరిపుచ్చుకుంది. నిన్న జరిగిన తొలిమ్యాచ్ లో ఓటమి పాలైన తెలుగు జట్టు.. ఈ ఓటమితో తన ఓటముల సంఖ్యను రెండుకు పెంచుకుంది.

K V D Varma

K V D Varma

Next Story