ProKabaddi League: గుజరాత్ ని పల్టీ కొట్టించిన పునేరీ పల్టాన్!

ఎట్టకేలకు పునేరి పల్టాన్ గాడిలో పడినట్టే కనిపిస్తోంది. పూనేలో శనివారం జరిగిన మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన చేసిన ఆ జట్టు గుజరాత్ జట్టును పల్టీ కొట్టించింది.

K V D Varma
Published on: 15 Sept 2019 9:28 AM IST
ProKabaddi League: గుజరాత్ ని పల్టీ కొట్టించిన పునేరీ పల్టాన్!
X

ఎట్టకేలకు పునేరి పల్టాన్ గాడిలో పడినట్టే కనిపిస్తోంది. పూనేలో శనివారం జరిగిన మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన చేసిన ఆ జట్టు గుజరాత్ జట్టును పల్టీ కొట్టించింది. ఇప్పటి వరకూ పదిహేను మ్యాచ్ లు ఆడిన పూణే జట్టుకి ఇది ఐదో విజయం. ఆల్రౌండ్ ప్రదర్శనతో గుజరాత్ జట్టును ఉక్కిరి బిక్కిరి చేసిన పూనేరీ పల్టాన్ జట్టు 43-33 సునాయాసంగా గెలిచేసింది.

పుణెరి జట్టులో స్టార్ రైడర్ నితిన్ తోమర్ జట్టుని ముందుండి నడిపించాడు. మ్యాచ్‌లో 18 సార్లు రైడ్‌కి వెళ్లిన నితిన్ 11 పాయింట్లని టీమ్‌కి అందించాడు. అతనికి డిఫెండర్ సుర్జీత్ నుంచి 5 పాయింట్లతో చక్కటి సహకారం లభించింది. ఇక సొంతగడ్డపై ప్రేక్షకుల నుంచి కూడా పుణె జట్టుకి ఊహించని సపోర్ట్ వచ్చింది.

గుజరాత్‌ జట్టుని ఒంటిచేత్తో గెలిపిస్తున్న సచిన్ ఈమ్యాచ్‌లో సరిగా ఆడలేకపోవడంతో గుజరాత్ కి పరాజయం తప్పలేదు. మొత్తంగా 20 సార్లు రైడ్‌కి వెళ్లిన సచిన్ 10 పాయింట్లతో సరిపెట్టగా.. డిఫెండర్ పర్వేశ్ మూడు పాయింట్లని మాత్రమే టీమ్‌కి అందించగలిగాడు.


K V D Varma

K V D Varma

Next Story