ప్రో కబడ్డీ లీగ్ : ఆరోసారీ..గెలుపు దక్కని టైటాన్స్

ప్రో కబడ్డీలో తెలుగు టైటాన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ఆడిన ఆరు మ్యాచుల్లో ఐదింట్లో ఓడిన ఆ జట్టు గురువారం బెంగళూరు జట్టు చేతిలో మరో ఓటమి మూటకట్టుకుంది.

K V D Varma
Updated on: 9 Aug 2019 9:11 AM IST
ప్రో కబడ్డీ లీగ్ : ఆరోసారీ..గెలుపు దక్కని టైటాన్స్
X

ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్ లలో భాగంగా గురువారం జరిగిన మ్యాచుల్లో తెలుగు టైటాన్స్ మళ్ళీ ఓడింది. ఇప్పటివరకూ ఆడిన ఆరు మ్యాచుల్లో 5 మ్యాచుల్లో పరాజయం చవిచూసి.. ఒక్కటి టై గా ముగించిన టైటాన్స్.. బెంగళూరు బుల్స్ తో ఆడిన మ్యాచులో ఓటమి పాలై.. పరాజయాల సంఖ్యను ఆరుకి పెంచుకుంది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలోనే టైటాన్స్ కొనసాగుతోంది. బెంగళూరు బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 47–26తో టైటాన్స్‌ ఓటమి పాలైంది. టైటాన్స్‌ రైడర్‌ సిద్ధార్థ్‌ దేశాయ్‌ 11 పాయింట్లతో తొలిసారి తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిచినా... బుల్స్‌ రైడర్‌ పవన్‌ కుమార్‌ (17 పాయింట్లు) రైడింగ్‌ ముందు నిలబడలేకపోయాడు. దీంతో ఓటమి పరాభవం తప్పలేదు తెలుగు టైటాన్స్ కి.



K V D Varma

K V D Varma

Next Story