Pro Kabaddi league: ఢిల్లీ, బెంగుళూరు జట్టుల ఆఖరు నిమిషం గెలుపు

చివరివరకూ చేసిన పోరాటంతో ఆఖరి నిమిషంలో గెలిచి ఊపిరి పీల్చుకుంది దబాంగ్ ఢిల్లీ. ప్రో కబడ్డీ లీగ్ ఏడో సీజన్ లో బెంగళూరు వేదికగా జైపూర్ పింక్ పాంథర్స్ తో దబాంగ్ ఢిల్లీ జట్టు తలపడింది.

K V D Varma
Published on: 5 Sept 2019 9:27 AM IST
Pro Kabaddi league: ఢిల్లీ, బెంగుళూరు జట్టుల ఆఖరు నిమిషం గెలుపు
X

చివరివరకూ చేసిన పోరాటంతో ఆఖరి నిమిషంలో గెలిచి ఊపిరి పీల్చుకుంది దబాంగ్ ఢిల్లీ. ప్రో కబడ్డీ లీగ్ ఏడో సీజన్ లో బెంగళూరు వేదికగా జైపూర్ పింక్ పాంథర్స్ తో దబాంగ్ ఢిల్లీ జట్టు తలపడింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఢిల్లీకి జైపూర్ జట్టు చుక్కలు చూపించింది. అయితే, పట్టు వదలకుండా పోరాడిన దబాంగ్ ఢిల్లీ 46-44 తేడాతో విజయాన్ని సాధించింది. దీంతో 12 మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ పది మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కాగా, జైపూర్ తానాడిన 13 మ్యాచ్ లలో ఆరింటిలో ఓటమి పాలై పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది.

దబాంగ్ ఢిల్లీ జట్టులో స్టార్ రైడర్ నవీన్ కుమార్ మొత్తం 24 సార్లు రైడ్‌కి వెళ్లి 16 పాయింట్లను జట్టుకి అందించి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. డిఫెండర్ జోగీందర్ నుంచి నవీన్ కు మంచి సహకారం లభించింది. జైపూర్ టీమ్‌లో 23 సార్లు రైడ్‌కి వెళ్లిన దీపక్ 9 పాయింట్లేసాధించి నిరాశపరిచాడు.

ఇక ఇదే వేదికగా ఈరోజు జరిగిన మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌పై 40-39 తేడాతో బెంగళూరు బుల్స్ విజయాన్ని అందుకుంది. ఆఖరి నిమిషం వరకూ ఉత్కంఠ ఊపేసిన ఈ మ్యాచ్‌లో.. పట్నా చిన్న తప్పిదం మ్యాచ్‌ని దూరం చేసింది.



K V D Varma

K V D Varma

Next Story