Pro Kabaddi league: నెంబర్ వన్ దబాంగ్ ఢిల్లీని కొట్టి 3 లోకి హర్యానా స్టీలర్స్

ప్రో కబడ్డీ సీజన్ 7 లీగ్ మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. అగ్రస్థానం లో ఉన్న దబాంగ్ ఢిల్లీకి శనివారం హర్యానా స్టీలర్స్ షాక్ ఇచ్చింది. దాంతో మూడోస్థానానికి ఎగబాకింది.

K V D Varma
Updated on: 8 Sept 2019 9:40 AM IST
Pro Kabaddi league: నెంబర్ వన్ దబాంగ్ ఢిల్లీని కొట్టి 3 లోకి హర్యానా స్టీలర్స్
X

ప్రో కబడ్డీ లీగ్ ఎడో సీజన్ లో కోల్‌కతా వేదికగా హర్యానా స్టీలర్స్ సంచలనం సృష్టించింది. అగ్రస్థానంలో దూసుకెళుతున్న దబాంగ్ ఢిల్లీకి చుక్కలు చూపించి చిత్తుగా ఓడించింది. దీంతో పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది హర్యానా స్టీలర్స్. కాగా, దబాంగ్ ఢిల్లీ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.

శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీని 47-25 తేడాతో హర్యానా స్టీలర్స్ చిత్తుచేసింది. హర్యానా జట్టులో స్టార్ రైడర్ వికాస్ ఖండోలా సూపర్-10తో రెచ్చిపోయాడు. . మ్యాచ్‌లో 17 సార్లు రైడ్‌కి వెళ్లి 10 పాయింట్లు సాధించాడు ఖండోలా. అతనికి డిఫెండర్ వికాస్ కాలె (5) నుంచి మంచి సహకారం లభించగా.. టీమ్ కూడా ఆఖర్లో ఎలాంటి తప్పిదాలకి తావివ్వలేదు. మరోవైపు దబాంగ్ ఢిల్లీ జట్టులోనూ నవీన్ కుమార్ 11 రైడ్ పాయింట్లు సాధించాడు. అయితే, డిఫెన్స్‌లో ఢిల్లీ జట్టు తడబడింది. పైగా వరుస తప్పిదాలతో మ్యాచ్‌ని చేజార్చుకుంది.

కాగా కోల్‌కతా లోనే శనివారం రాత్రి బెంగాల్ వారియర్స్, గుజరాత్ పార్చూన్‌ జెయింట్స్‌ మధ్య జరిగిన మరో మ్యాచ్ టైగా ముగిసింది. ఆఖరి వరకూ నువ్వే నేనా అన్నట్లు తలపడిన రెండు జట్లూ 25-25తో మ్యాచ్‌ని ముగించాయి.



K V D Varma

K V D Varma

Next Story