Pro Kabaddi league: దబాంగ్ ఢిల్లీ విజయభేరి!

ప్రోకబడ్డీ లీగ్ సీజన్ 7 లో దబాంగ్ ఢిల్లీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. శనివారం హర్యానా స్టీలర్స్ పై ఓటమి పాలైనా.. మళ్లీ పుంజుకుని ఆదివారం తమిళ తలైవాస్ పై ఘన విజయం సాధించింది.

K V D Varma
Published on: 9 Sept 2019 7:27 AM IST
Pro Kabaddi league: దబాంగ్ ఢిల్లీ విజయభేరి!
X

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్ 7లో దబాంగ్ ఢిల్లీ మెరిసింది. శనివారం హర్యానా స్టీలర్స్ చేతిలో ఓటమి పాలైన ఢిల్లీ తేరుకుంది. ఆదివారం తమిళ తలైవాస్ పై దూకుడుగా ఆడి ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 50-34 తేడాతో తమిళ తలైవాస్ ని మట్టికరిపించి పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఇక తమిళ తలైవాస్ తొమ్మిదో పరాజయాన్ని మూటకట్టుకుని 11 వ స్థానం లో నిలిచింది.

మ్యాచ్‌లో 23 సార్లు రైడ్‌కి వెళ్లిన దబాంగ్ ఢిల్లీ రైడర్ నవీన్ కుమార్17 పాయింట్లను టీమ్‌కి అందించగా.. డిఫెండింగ్‌లో అనిల్ కుమార్ 3 పాయింట్లతో సహకరించాడు. మరోవైపు తమిళ్ తలైవాస్ జట్టులో 18 సార్లు రైడ్‌కి వెళ్లిన రాహుల్ చౌదరి.. 14 పాయింట్లు సాధించాడు. కానీ.. డిఫెండింగ్ లో అతనికి సహకరించే వారే లేకపోవడంతో తమిళ్ తలైవాస్‌కి ఓటమి తప్పలేదు.

మరో మ్యాచ్‌లో పుణెరి పల్టాన్‌పై 42- 39 తేడాతో బెంగాల్ వారియర్స్ విజయం సాధించింది. శనివారం గుజరాత్ పార్చూన్ జెయింట్స్‌తో మ్యాచ్‌ని టైగా ముగించిన బెంగాల్.. ఎట్టకేలకి మళ్లీ విజయంతో గాడిన పడింది. దీంతో.. 7వ విజయాన్ని అందుకున్న బెంగాల్ వారియర్స్ టాప్-2లోకి దూసుకెళ్లగా.. 8వ ఓటమితో పుణెరి టీమ్ 10వ స్థానంలో సరిపెట్టుకుంది.


K V D Varma

K V D Varma

Next Story