దబంగ్‌ ఢిల్లీకి గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ బ్రేక్

దబంగ్‌ ఢిల్లీకి గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ బ్రేక్
x
Highlights

విజయాలతో దూకుడు మీదున్న దబంగ్‌ ఢిల్లీకి గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ బ్రేక్ వేసింది. ముంబై లో జరుగుతున్న ప్రో కబడ్డీ సీజన్ 7లో భాగంగా గురువారం జరిగిన...

విజయాలతో దూకుడు మీదున్న దబంగ్‌ ఢిల్లీకి గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ బ్రేక్ వేసింది. ముంబై లో జరుగుతున్న ప్రో కబడ్డీ సీజన్ 7లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్ లో గుజరాత్ జట్టు 5 పాయింట్ల తేడాతో ఢిల్లీకి షాక్ ఇచ్చింది. సరైన సమయంలో చక్కని ఆటతీరు ప్రదర్శించిన గుజరాత్ ఆటగాళ్లు విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. గుజరాత్ కు 31 పాయింట్లు రాగా, ఢిల్లీ 25 పాయింట్లతో సరిపెట్టుకుంది.

మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన మోరే 9 పాయింట్ల(4 రైడ్‌ పాయింట్లు, 4 టాకిల్‌ పాయింట్లు, ఒక బోనస్‌ పాయింటు)తో గుజరాత్‌కు విజయాన్ని అందించాడు. అతనికి రోహిత్‌ గులియా (8 పాయింట్లు) నుంచి చక్కని సహకారం అందింది. దబంగ్‌ రైడర్‌ నవీన్‌ కుమార్‌ సూపర్‌ 'టెన్‌' సాధించినా ఆ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories