బెంగళూరు బుల్స్ ను వేటాడేసిన గుజరాత్ ఫార్ట్యూన్ జెయింట్స్

K V D Varma
Published on: 21 July 2019 8:44 PM IST
బెంగళూరు బుల్స్ ను వేటాడేసిన గుజరాత్ ఫార్ట్యూన్ జెయింట్స్
X

ప్రో కబడ్డీ లీగ్ ఏడో సీజన్ రెండో రోజు తొలి మ్యాచ్ ముగిసింది. ఈ మ్యాచ్ లో బెంగళూరు బుల్స్, గుజరాత్ గుజరాత్ ఫార్ట్యూన్ జెయింట్స్ తలపడ్డాయి. ఆట మొత్తం వన్సైడ్ గా సాగింది. గుజరాత్ ఆటగాళ్ళు బెంగళూరు ఆటగాళ్ళని నిలువనీయలేదు. వరుసగా పాయింట్లు సాధిస్తూ వత్తిడి పెంచారు. దీంతో గుజరాత్ ఫార్ట్యూన్ జెయింట్స్, బెంగళూరు బుల్స్ పై 18 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గుజరాత్ 42 పాయింట్లు సాధించగా, వారి ధాటికి బెంగళూరు 24 పాయింట్లతో సరిపెట్టుకుంది.

రెండో రోజు రెండో మ్యాచ్ తెలుగు టైటాన్స్, తమిళ తలైవాస్ తో జరగనుంది.


K V D Varma

K V D Varma

Next Story