Pro Kabaddi: తమిళ్ తలైవాస్‌ని అలవోకగా ఓడించిన బెంగళూరు

ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌ ఆదివారం బెంగళూరు వేదికగా తమిళ్ తలైవాస్‌తో వార్సెస్ బెంగళూరు బుల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్‌ని అలవోకగా ఓడించింది బెంగళూరు బుల్స్. బెంగళూరు బుల్స్ 33-27 తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.

కె.హెచ్. బాబు
Updated on: 2 Sept 2019 11:26 AM IST
Pro Kabaddi: తమిళ్ తలైవాస్‌ని అలవోకగా ఓడించిన బెంగళూరు
X

ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌ ఆదివారం బెంగళూరు వేదికగా తమిళ్ తలైవాస్‌తో వార్సెస్ బెంగళూరు బుల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్‌ని అలవోకగా ఓడించింది బెంగళూరు బుల్స్. బెంగళూరు బుల్స్ 33-27 తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. పాయింట్ల పట్టికలో బెంగళూరు మూడో స్థానానికి చేరుకోగా తమిళ్ తలైవాస్‌ ఏడో ఓటమితో ఏకంగా 9వ స్థానానికి పడిపోయింది. బెంగళూరు జట్టులో స్టార్ రైడ్ పవన్ షెరావత్ ఒంటిచేత్తో విజయం సాధించాడు అని చెప్పవచ్చు. మ్యాచ్‌లో 21సార్లు కూతకి వెళ్లిన 17 పాయింట్లతో తీసుకొచ్చాడు. పవన్‌కి తోడు డిఫెండర్ అమిత్ (5 పాయింట్లు) నుంచి చక్కటి సహకారం లభించడంతో ఆఖరి వరకూ తమిళ్ తలైవాస్‌పై బెంగళూరు విజయకేతనం ఎగురవేసింది. ఇక మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్‌పై 29-32 తేడాతో యూపీ యోధా విజయం సాధించింది.

కె.హెచ్. బాబు

కె.హెచ్. బాబు

Next Story