బెంగాల్‌ జోరు ముందు.. తమిళ్ తలైవాస్ బేజారు

బెంగాల్‌ జోరు ముందు.. తమిళ్ తలైవాస్ బేజారు
x
Highlights

ప్రొకబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో బెంగాల్‌ వారియర్స్‌ జట్టు గెలుపుబాట పట్టింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఆధిపత్యం చెలాయించిన బెంగాల్ టీమ్ 35-26 తేడాతో తమిళ్ తలైవాస్‌ని ఓడించేసింది.

ప్రొకబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో బెంగాల్‌ వారియర్స్‌ జట్టు గెలుపుబాట పట్టింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఆధిపత్యం చెలాయించిన బెంగాల్ టీమ్ 35-26 తేడాతో తమిళ్ తలైవాస్‌ని ఓడించేసింది. రైడింగ్‌లో వారియర్స్‌ ఆటగాళ్లు ప్రపంజన్‌(10పాయింట్లు), మహీందర్‌ సింగ్‌(9పాయింట్లు) అదరగొట్టగా..ఇక డిఫెండర్ రింకూ 7 సార్లు ట్యాకిల్‌ కోసం ప్రయత్నించి.. ఐదు పాయింట్లతో మెరిశాడు. టోర్నీలో 11వ మ్యాచ్‌ ఆడిన బెంగాల్ వారియర్స్‌కి ఇది ఆరో గెలుపుకాగా.. 10వ మ్యాచ్‌ ఆడిన తమిళ్ తలైవాస్‌కి ఇది ఐదో ఓటమికావడం విశేషం. పట్టికలో బెంగాల్ జట్టు ఐదో స్థానంలో నిలవగా.. తమిళ్ టీమ్ 8వ స్థానంలో ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories