Pro Kabaddi: హర్యానా స్టీలర్స్‌పై ఘనవిజయంతో.. సెమీస్ చేరిన యు ముంబా

ప్రొ కబడ్డీ లీగ్ 7వ సీజన్‌లో అహ్మదాబాద్ వేదికగా హర్యానా స్టీలర్స్‌ యు ముంబా మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది.

Samba Siva Rao
Updated on: 15 Oct 2019 11:57 AM IST
Pro Kabaddi: హర్యానా స్టీలర్స్‌పై ఘనవిజయంతో.. సెమీస్ చేరిన యు ముంబా
X

ప్రొ కబడ్డీ లీగ్ 7వ సీజన్‌లో అహ్మదాబాద్ వేదికగా హర్యానా స్టీలర్స్‌ యు ముంబా మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ యు ముంబా జట్టు 46-38 పాయింట్ల తేడాతో హర్యానా స్టీలర్స్‌పై ఘనవిజయం సాధించింది. హర్యానా స్టీలర్స్‌ పై విజయంతో యుముంబా సెమీ ఫైనల్‌కి చేరింది. సోమవారంతో ఎలిమినేటర్ మ్యాచ్‌లు ముగిశాయి.

యుముంబా జట్టు స్టార్ రైడర్ అభిషేక్ 16 పాయింట్ల సాధించాడు. జట్టు విజయంలో అభిషేక్ కీలక పాత్ర పోషించాడు. ఇక హర్యానా స్టీలర్స్ స్టార్ రైడర్ వికాస్ ఖండోలా 12 పాయింట్లు మాత్రమే సాధించి ఈ మ్యాచ్ లో నిరాశపరిచాడు. డిఫెండర్ ఛాంద్ కూడా నిరాశపరిచాడు. ఈ విజయంతో యు ముంబా జట్టు బుధవారం సెమీఫైనల్ మ్యాచ్ లో బెంగాల్ వారియర్స్ ను ఢీకొట్టనుంది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story