YS Sharmila: ఇవాళ కాంగ్రెస్‌లో చేరనున్న షర్మిల

YS Sharmila: ఉ.10.30 గంటలకు కాంగ్రెస్ పార్టీలో చేరిక

Jyothi
Published on: 4 Jan 2024 8:46 AM IST
YS Sharmila will Join Congress Today
X

YS Sharmila: ఇవాళ కాంగ్రెస్‌లో చేరనున్న షర్మిల

YS Sharmila: వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల నిన్న రాత్రి దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. తన సోదరుడు, ఏపీ సీఎం జగన్‌ ఇంటికి వెళ్లిన షర్మిల.. తన కుమారుడి వివాహానికి సీఎం జగన్‌ను ఆహ్వానించారు. అనంతరం.. ఆమె.. విజయవాడ నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఢిల్లీ చేరుకున్న షర్మిల.. ఇవాళ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. ఉదయం పదిన్నర గంటలకు వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ గూటికి చేరనున్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో ఆమె కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారు.

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా.. కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు పలికారు. తమ మద్దతు కారణంగానే తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని ఇప్పటికే షర్మిల స్పష్టం చేశారు. ఈ క్రమంలో తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

Jyothi

Jyothi

Next Story