కర్ణాటక అసెంబ్లీలో యడ్యూరప్ప బలపరీక్ష నేడే

K V D Varma
Updated on: 29 July 2019 11:11 AM IST
కర్ణాటక అసెంబ్లీలో యడ్యూరప్ప బలపరీక్ష నేడే
X

కర్ణాటక అసెంబ్లీలో ఇవాళ యడ్యూరప్ప బలపరీక్షను నిరూపించుకోనున్నారు. ఉదయం 10గంటలకు సభ ప్రారంభం కానుంది. కర్ణాటక విధాన సభలో మొత్తం 224 మంది ఉండగా.. ప్రస్తుతం 207 మంది ఉన్నారు. మెజార్టీకి కావాల్సిన సంఖ్యాబలం 104. అయితే, బీజేపీకి ఎమ్మెల్యేలు 105 మంది ఉండగా.. మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. దీంతో విశ్వాస పరీక్షలో బీజేపీ నెగ్గడం ఖాయమైపోయింది. ఇక బలపరీక్ష అనంతరం సభలో ఆర్థిక బిల్లును యడ్యూరప్ప సర్కార్ ప్రవేశపెట్టనుంది.

K V D Varma

K V D Varma

Next Story