Yediyurappa: కర్ణాటక సీఎం పదవికి యెడియూరప్ప రాజీనామా

Karnataka: యడ్యూరప్ప మార్పుపై కొనసాగుతున్న సస్పెన్స్‌ కు తెర

Sandeep Eggoju
Updated on: 26 July 2021 12:18 PM IST
Yediyurappa Resigns Karnataka CM Post
X

కర్ణాటక సీఎం పదవికి రాజీనామా చేసిన యెడియూరప్ప (ఫైల్ ఇమేజ్)

Karnataka: కర్ణాటక సీఎం మార్పుపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెర పడింది. ఈ సమయంలో యెడియూరప్ప ప్రకటనతో కన్నడ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. పదవి ఉన్నా లేకపోయినా మరో 10-15 ఏళ్ల బీజేపీ కోసం పనిచేస్తానని చెప్పారు. రెండు దశాబ్దాలుగా కన్నడనాట బీజేపీలో చక్రం తిప్పుతున్న 78 ఏళ్ల యెడియూరప్పను మారుస్తారని కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతుంది. ఇటీవల ఆయన ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలసి వచ్చిన యెడియురప్ప సోమవారం తన సీఎం పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. మరికాసేపట్లో తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు అందజేయనున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story