కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి కథా కమామీషు!

కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి కథా కమామీషు!
x
Highlights

కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి కోల్పోయింది. ఇది ఒక బిల్లు రూపంలో రాజ్యసభలో ప్రవేశ పెట్టారు. దానిపై ఇంకా చర్చ సాగుతున్నప్పటికీ, కేంద్రం రాష్ట్రపతి ద్వారా...

కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి కోల్పోయింది. ఇది ఒక బిల్లు రూపంలో రాజ్యసభలో ప్రవేశ పెట్టారు. దానిపై ఇంకా చర్చ సాగుతున్నప్పటికీ, కేంద్రం రాష్ట్రపతి ద్వారా ఆర్డినెన్స్ తీసుకువచ్చి దానిని వెంటనే అమలు చేసే విధంగా ఉంది. దీంతో కాశ్మీర్ ఇన్నేళ్ళుగా ఉన్న ప్రత్యేక హోదా రద్దయిపోయింది. ఇప్పుడు అసలు కాశ్మీర్ కి స్వయంప్రతిపత్తిని ఇచ్చిన ఆర్టికల్ 370 అంటే ఏమిటనే అనుమానం చాలా మందికి ఉంటుంది. ఆ విశేశాలివిగో..

ఎప్పుడు ఎవరు రూపొందిచారు..

భారత రాజ్యాంగం ప్రకారం.. జమ్మూకశ్మీర్‌ రాష్ర్టానికి ఆర్టికల్‌ 370 స్వయంప్రతిపత్తి హోదా కల్పిస్తుంది. రాజ్యాంగంలోని 21వ పార్ట్‌లో దీన్ని పొందుపరిచారు. ఆర్టికల్‌ 370 కింద కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించారు. దేశంలోని మిగతా రాష్ర్టాలకు రాజ్యాంగ ప్రకారం కల్పించే సౌకర్యాలు కశ్మీర్‌కు వర్తించవు. 1947లో షేక్‌ అబ్దుల్లా ఈ ఆర్టికల్‌ ముసాయిదాను తయారు చేశారు. రాజా హరిసింగ్‌, నెహ్రూ ఆదేశాల ప్రకారమే.. అబ్దుల్లా ఆర్టికల్‌ ముసాయిదాను రూపొందించారు.

దీనితో కాశ్మీర్ ప్రత్యేకతలు ఇవే..

- రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సమాచార అంశాలు మినహా.. మిగితా చట్టాల అమలు కోసం కశ్మీర్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తప్పనిసరి. ఆ రాష్ట్రం ఒప్పుకుంటేనే పార్లమెంట్ చట్టాలను అమలు చేసే అవకాశం ఉంటుంది. లేదంటే అది ఎంత ముఖ్యమైనదైనా దానిని పక్కన పెట్టాల్సిందే. అంటే భారతీయలందరికీ ఉండే చట్టాలు ఇక్కడి ప్రజలకు వర్తించవు. కశ్మీర్‌ ప్రజలు ప్రత్యేక చట్టం కింద జీవిస్తాఋ.

- పౌరసత్వం, ఆస్తులపై హక్కులు,, ప్రాథమిక హక్కులు కూడా కశ్మీర్‌కు వేరే. దీని ప్రకారం ఇతర రాష్ర్టాల ప్రజలు కశ్మీర్‌లో స్థిరాస్తులు కొనే అవకాశం ఉండదు. ఆర్టికల్‌ 370 ప్రకారం కశ్మీర్‌లో ఆర్థిక ఎమర్జెన్సీ విధించే అధికారం కూడా కేంద్రానికి ఉండదు. కేవలం యుద్ధం లేదా బాహ్య వత్తిళ్ల వల్ల ఏర్పడే పరిణామాల నేపథ్యంలోనే కశ్మీర్‌లో ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం ఉంటుంది.

- ఒకవేళ రాష్ట్రంలో ఏవైనా అల్లర్ల చోటుచేసుకుంటే, ఆ సమయంలో కూడా ఎమర్జెన్సీ విధించే అవకాశం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం కోరితేనే కేంద్రం ఎమర్జెన్సీని ప్రకటిస్తుంది.

రద్దు చేయాలని భావించిందీ అందుకే..

అందుకే ప్రత్యేక చట్టాల అమలు కోసం తయారైన ఆర్టికల్‌ 370ని రద్దు చేయాలని బీజేపీ తొలినుంచి భావించింది. దాని కోసమే తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆ వాగ్దానం కూడా చేసింది. 2019లో తిరిగి తాము అధికారంలోకి వస్తే కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తామని మోదీ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. తాజాగా అమిత్‌ షా ప్రకటనతో ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చారు. దీంతో దీంతో కశ్మీర్‌ ప్రత్యేక హక్కులను కోల్పోయి.. కేంద్ర ప్రభుత్వానికి పూర్తి హక్కులను కల్పించబడ్డాయి. ఇక పార్లమెంట్‌ చేసే ప్రతిచట్టం దేశమంతటితో పాటు కశ్మీర్‌లోనూ అమలు కానుంది. కశ్మీర్‌ భూభాగాల మార్పుపై కూడా పూర్తి అధికారం కేంద్ర ప్రభుత్వానికి సంక్రమించింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories