హరిద్వార్‌లో వసంత పంచమి వేడుకలు

Sandeep Eggoju
Published on: 16 Feb 2021 11:46 AM IST
Vasantha Panchami celebrations in Haridwar
X

హరిద్వార్ టెంపుల్ (ఫైల్ ఇమేజ్)

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. వసంత పంచమి సందర్భంగా గంగా స్నానం ఆచరించేందుకు భక్తులు భారీగా చేరుకున్నారు. తెల్లవారుజాము నుంచి పవిత్ర స్నానాలు చేస్తోన్న భక్తులతో గంగానదీ తీరం కోలాహలంగా మారింది. ఇక భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు, అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. పుణ్యస్నానాలకు వచ్చే భక్తులకు కరోనా ర్యాండమ్ పరీక్షలు చేసి అనుమతిస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story